చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బడా లీడర్లను గ్రుహ నిర్బంధం చేశారు.. అంతేకాకుండా జిల్లాలోని అంగళ్ల గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎవరినీ అటువైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకాలను అడ్డుకునేవారు లేరా..? అంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఏపీ మంత్రికి కంట్లో నలుసుగా మారిన జనసేన నేత..!
చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం టీడీపీ నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ నేతలపై దాడి జరిగింది. వైసీపీ నేతలే ఈ దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ‘చలో తంబళ్లపల్లె’కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అంతేకాకుండా టీడీపీ నాయకులు నరసింహాయాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, కలికిరిలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తదితర నేతలను హౌజ్ అరెస్టు చేశారు.
Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..
ఈఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండి కొడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కే ఓ లేఖ రాశారు. అందులో ‘తంబళ్లపల్లెలో మాఫియా పడగ విప్పింది. కురబల కోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీకి చెందిన 200 మంది టీడీపీ నాయకుల వాహనాలపై దాడి చేసి గాయపర్చారు. ఈ విధ్వంసక దాడి అంతటితో ఆగకుండా ఓ జర్నలిస్టుపై దాడి చేశారు.’ అని పేర్కొన్నారు.
అంతేకాకుండా చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నాడని ఆయన ప్రొద్భలంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్