Janasena: జనసేన తన పట్టు పెంచుకోవాలని చూస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభావం పెరిగిన నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా కొన్ని స్థానాల్లో గెలిచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ర్టంలో సమస్యల సాధనకు నడుం బిగించాలని సూచిస్తోంది. ఏపీలో ప్రధాన పార్టీలతో పోటీ పడాలని అధినేత ఫోకస్ పెట్టారు. సొంత సామాజిక వర్గంలో తన బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇన్నాళ్లు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న పార్టీలకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు.

చాలా కాలంగా కాపుల రిజర్వేషన్ల అంశం పెండింగులో ఉంది. దీని పరిష్కారంపై ఓ వాగ్దానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం జిల్లాల వారీగా కాపులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. దీనికి పవన్ కల్యాణ్ హాజరు కాకపోయినా ఆయన సందేశం పంపనున్నారు. నాగబాబు మాత్రం హాజరయ్యే అవకాశాలున్నాయి. జనసేన అధికారంలోకి వస్తే కాపుల సమస్యలు తీరతాయని చెప్పనున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి పలు సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జనసేన సిద్ధమైనట్లు సమాచారం. దసరా తరువాత ఈ కార్యక్రమాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
జనసేన తన బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్టంలో పట్టు నిలుపుకుని అధికారం చేపట్టి ప్రజలకు సేవ చేయాలని తాపత్రయ పడుతోంది. ఇందుకోసమే అన్ని మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలో జనసేన యాభైకి తగ్గకుండా నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. పార్టీని గాడిలో పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.