Janasena: హైదరాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోంది. ఈ గ్యాంగ్ రేప్ లో హోంమంత్రి మనవడు ఉన్నాడని.. ఓ తెలంగాణ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూలో బీజేపీ, కాంగ్రెస్ లో విమర్శలు గుప్పిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు కూడా చేశాయి.
ఇప్పుడు ఈ ఉద్యమంలోకి జనసేన వచ్చి చేరింది. హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ లో అసలు నిందితులను తప్పిస్తున్నారని జనసేన రోడ్డెక్కింది. ఏకంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడికి జనసేన కార్యకర్తల ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. .. జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ కు జనసేన కార్యకర్తలను తరలించారు.
Also Read: Pawan Kalyan and Nagababu: పవన్ కళ్యాణ్, నాగబాబూ ఇద్దరి టార్గెట్ అదే
జనసేన ఆందోళనలతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మ తల్లి గుడి వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు క్లియర్ చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన పోరుబాట పట్టడంతో ఇప్పుడు టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ లు పోరాడుతుంటే తాజాగా జనసేన కూడా అందులోకి చేరడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. మరో ముగ్గురు గ్యాంగ్ రేప్ నిందితులను అరెస్ట్ చేశారు. ఉమర్ ఖాన్ తోపాటు ఇద్దరు మైనర్లను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. శుక్రవారం ఒక బాలుడిని. సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Gully Boy Riyaz Marriage: గల్లీ బాయ్స్ ఫేమ్ పొట్టి రియాజ్ పెళ్లి.. ఎవరిని చేసుకున్నాడో తెలుసా?



[…] […]