https://oktelugu.com/

Anasuya Bharadwaj: బీచ్ లో లిప్ కిస్సులు హాట్ హగ్గులతో రెచ్చిపోయిన అనసూయ… వీడియో వైరల్!

Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ బీచ్ లో పబ్లిక్ రొమాన్స్ కురిపించింది. లిప్ కిస్సులు, హగ్గులతో రచ్చ చేసింది. అనసూయ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త భరద్వాజ్ పై అనసూయ అన్ లిమిటెడ్ ప్రేమ కురిపించగా, అభిమానులు ఫిదా అవుతున్నారు. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. దీని కోసం భర్త పిల్లలతో విహారానికి చెక్కేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో అనసూయ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 4, 2022 / 12:51 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ బీచ్ లో పబ్లిక్ రొమాన్స్ కురిపించింది. లిప్ కిస్సులు, హగ్గులతో రచ్చ చేసింది. అనసూయ రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త భరద్వాజ్ పై అనసూయ అన్ లిమిటెడ్ ప్రేమ కురిపించగా, అభిమానులు ఫిదా అవుతున్నారు. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. దీని కోసం భర్త పిల్లలతో విహారానికి చెక్కేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియో అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. బీచ్ లో ఏకాంతంగా అనసూయ-భరద్వాజ్ ఒకరిపై మరొకరు ప్రేమ కురిపించారు. ముఖ్యంగా అనసూయ భర్తను ముద్దులతో ముంచెత్తింది. వీరి లిప్ కిస్సులు, హాట్ హగ్గులకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    Anasuya Bharadwaj

    ఇది తమ 12వ పెళ్లిరోజుగా అనసూయ తెలియజేశారు. అలాగే 21 ఏళ్లుగా కొనసాగుతున్న బంధం అన్నారు. అనసూయ-భరద్వాజ్ లది ప్రేమ వివాహం. ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఎన్ సి సి క్యాంపులో భరద్వాజ్ తో అనసూయకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వాళ్ళ ప్రేమకు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయి. భరద్వాజ్ తో పెళ్ళికి అనసూయ తండ్రి ససేమిరా అన్నారు. ఇంటి నుండి బయటికొచ్చిన అనసూయ చాలా కాలం హాస్టల్ లో ఉన్నారు.

    Also Read: Pawan Kalyan and Nagababu: పవన్ కళ్యాణ్, నాగబాబూ ఇద్దరి టార్గెట్ అదే

    ఎట్టకేలకు తండ్రిని ఒప్పించి ప్రేమను గెలిపించుకున్నారు. ఈ 12 ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. యాంకర్ గా నటిగా తీరిక లేని జీవితం గడిపే అనసూయ… కుటుంబం కోసం కొంత సమయం కేటాయిస్తారు. ఏడాదిలో రెండు మూడు సార్లు వెకేషన్ కి వెళతారు. ఖాళీ సమయం దొరికితే చాలు, కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు.

    Anasuya Bharadwaj

    ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో దర్జా అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఆమె లేడీ గ్యాంగ్ స్టర్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు రంగమార్తాండ, పుష్ప 2, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అటు యాంకర్ గా జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. ఆమె సంపాదన కోట్లలో ఉంటుందని సమాచారం. న్యూస్ యాంకర్ నుండి అనసూయ ఈ స్థాయికి ఎదిగారు.

    Also Read:Star Heroine: తమిళ తెరపై వెలిగిపోతున్న అచ్చ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

    Recommended Videos:


    Tags