Pawan Kalyan: ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉద్యోగుల ఆందోళనపై తన మనోభావాలను బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా వారి తరుఫున పోరాడడానికి ముందు ఉంటాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. కానీ ఉద్యోగుల ఉద్యమం తారాస్థాయికి చేరిన వేళ ఆయన చివరకు లేట్ గా స్పందించారు. వెల్లువెత్తుతున్న విమర్శలకు స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి సమాధానం ఇచ్చారు.
ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడకు ముందు పవన్ పెద్దగా ఈ ఇష్యూపై స్పందించలేదు. కానీ పోలీసులు అడగడుగునా అడ్డుకున్నా ర్యాలీ సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేస్తుందేమో అని భావించారు. ప్రభుత్వం మాత్రం సేమ్ డైలాగ్ లే చెప్పింది.
Also Read: ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..
ఇక ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల సమస్యను మరింత జటిలం చేసుకునే దిశగా బలప్రదర్శనలపై ఉక్కుపాదం మోపుతామనడం ఉద్యోగుల్లో కసిని పెంచింది. పోలీసులను మోహరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
అయితే ఏపీలో ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా.. తానే ముందు ఉంటానని చెప్పే పవన్ ఇప్పటివరకూ ఉద్యోగుల సమస్యపై పెదవి విప్పకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఇప్పటివరకూ ఎందుకు మాట్లాడలేదు అన్న దానికి పవన్ సమాధానం చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పిందని.. అలాగే ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు వైసీపీ ఎందుకు మాట తప్పింది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాయకులు ఈనాడు మాట మార్చడం సరైన పద్ధతి కాదని సూచించారు.
అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాకా మరో మాట మాట్లాడడం మోసపూరిత చర్యగానే జనసేన భావిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్ట్ లు చేయడం.. లాఠీచార్జ్ చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.
ప్రతి ఉద్యోగి పీఆర్సీ ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా పిల్లల చదువుల ఖర్చు.. ఇతర ఖర్చులకు ఒక బడ్జెట్ వేసుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల బాధలు తెలుసు అంటూ పవన్ ఎమోషనల్ అయ్యారు.
ఈరోజున వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే.. ఉద్యోగుల జీతాలు 30శఆతం తగ్గడం ఎంతవరకూ సమంజసం అని పవన్ నిలదీశారు. అధికారంలోకి వచ్చేందుకు సీపీఎస్ రద్దు చేస్తామని.. జీతాలు పెంచుతామని అన్నారు.
అయితే పవన్ ఇక ఉద్యోగులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. జనసేన నాయకులకు, శ్రేణులకు, జనసైనికులకు కూడా చెబుతున్నామని సంచలన పిలుపునిచ్చారు. దీంతో ఈ ఉద్యమం కొత్త రూపు సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: సిరిసిల్లలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ భాగోతం