AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో జగన్ కు తలనొప్పిగా మారుతోంది. లేని సమస్యను తీసుకొచ్చి తగిలించుకున్నట్లుగా అయిపోయింది. ఏదో సాఫీగా సాగుతుందనుకున్న బాగోతం ప్రసస్తుతం జఠిలంగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం తయారైపోయింది. ఒక్క జిల్లాలో కాదు అన్ని జిల్లాల్లో నిరసన సెగలు నింగినంటుతున్నాయి. ఏదో ప్రతిపక్షానికి జలక్ ఇద్దామని అనుకున్న జగన్ తానే గోతిలో పడినట్లు అయిపోయింది. జిల్లాల ఏర్పాటుతో సమస్య మొదటికొచ్చినట్లయింది. కొరివితో తల గోక్కోవడమంటే ఇదేనేమో. అనవసరంగా అగ్గి రాజేసుకున్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా చల్లారేలా కనిపించడం లేదు. ఇంకా డిమాండ్లు పెరుగుతున్నాయి. అదీ కూడా సొంత పార్టీ నేతలతోనే కావడం విశేషం.
ఈనేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మరోటి పుడుతూనే ఉంది. ప్రతిపక్ష నేతలు సైలెంట్ గానే ఉన్నా సొంత పార్టీ నేతల్లోనే అసమ్మతి రాగం పెరిగిపోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో సీఎం ఏ ప్రాతిపదిక పాటించారో చెప్పాలని నిలదీస్తున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లా చేయాల్సిందేనని డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో సమస్య ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సొంత పార్టీ నేతలతోనే కుంపట్లు రాజేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల రోట్ల మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సీఎం వైఖరిని నిరసిస్తున్నారు. తమ మాట నెగ్గించుకోవాలని పట్టుదలతో ఉన్నారు.
Also Read: AP New Schemes: ఏపీలో కొత్త పథకాలు.. ఈ నెల నుంచే అమలు.. అర్హుల ఖాతాల్లో రూ.10 వేలు
ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదకు వస్తోంది. రాయలసీమ జిల్లాలను 14 జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదన ఒకటి వెలుగులోకి వస్తోంది. రాయలసీమ డెవలప్ మెంట్ కమిటీ కన్వీనర్ గా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రతిపాదన చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలను పద్నాలుగు జిల్లాలుగా చేయాలని చెబుతున్నారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పరిస్థితి మారే అవకాశం ఏర్పడింది. నూతన జిల్లాల ఏర్పాటు కొరకరాని కొయ్యగా మారుతోంది.
ఇప్పుడు కొత్తగా రాజశేఖర్ రెడ్డి లేవనెత్తిన డిమాండ్ కు ప్రజల మద్దతు పెరిగితే మరో ఉద్యమం మొదలయ్యే ప్రమాదం రానుంది. జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనకే గుణపాఠం నేర్పుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రహసనంగా మారనుంది. అన్ని జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న క్రమంలో జగన్ కు గుదిబండగా మారుతోంది. జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఇప్పట్లో చల్లారేలా లేదు. భవిష్యత్ లో ఇంకా ఎన్ని అభ్యంతరాలు వస్తాయో? జిల్లాల ఏర్పాటు పనులు ముందుకు సాగుతాయో ?లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: AP New Districts: జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల ఆధిపత్యం