Pawan Kalyan Narasapuram: జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని నర్సాపురంలో పర్యటించారు. సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలకు సమయం కేటాయిస్తున్నారు. అధికార వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల తరుఫున పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. వారి ఆవేదనను ఎలుగెత్తి చాటడానికి రెడీ అయ్యారు. నర్సాపురం వేదికగా జరుగుతున్న ఈ మత్స్యకార సభలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు.

పవన్ రాకతో అభిమానులు హంగామా అంతా ఇంతాకాదు.. జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ గోల చేశారు. ఆ సమయంలో ఓ అభిమాని పవన్ కాళ్లమొక్కడానికి చేతిలో చేయి వేసి ఆశీర్వాదం తీసుకోవడానికి పవన్ వద్దకు పరుగున వచ్చాడు. కారుపైన నిలుచున్న పవన్ ను ఆ స్పీడులో తాకడంతో పవన్ కింద పడిపోయాడు. పవన్ బాడీగార్డ్ అభిమానిని కిందకు లాగడంతో పవన్ కూడా కింద పడ్డాడు. మళ్లీ వెంటనే లేచి నిల్చొని ముందుకు సాగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ హఠాత్ పరిణామంతో పవన్ కళ్యాణ్ కారుపైనే జారిపడిపోయాడు. పవన్ కళ్యాణ్ కాసేపు కారుపైనే కూర్చుండిపోయారు. తర్వాత నవ్వుకుంటూ పైకి లేచి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న 217 జీవోపై గళం ఎత్తడానికి పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ చేపట్టారు. మత్య్సకారుల సమస్యల పరిష్కారం పోరాటం చేస్తూ ఆదివారం నరసాపురంలో నిర్వహించిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.
[…] Nandamuri Balakrishna: నట సింహం బాలయ్య తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ స్థాయిలో చేస్తున్నాడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు ‘వీరసింహారెడ్డి’, ఈ సినిమా టైటిల్ ను కూడా ‘వీరసింహారెడ్డి’గానే పెట్టాలని ఆలోచిస్తున్నారు మేకర్స్. ఎలాగూ ‘సింహా’ అనే టైటిల్ తో బాలయ్యకు ఎప్పటినుంచో హిట్ సెంటిమెంట్ వుంది. బాలకృష్ణ కెరీర్ లో ‘సింహా’ అనే టైటిల్స్ తో వచ్చిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడాయి. […]
[…] Prakash Raj With KCR: రాజకీయాల్లో గండర గండుడు అయిన కేసీఆర్.. ఏ పని చేసినా కొంత ట్విస్ట్ అనేది ఉంటుంది. అంతిమంగా ఆ పని ఫలితం వచ్చే దాకా.. ఆ ట్విస్ట్ ఎవరికీ అర్థం కాదు. ఇప్పటికే ఆయన ఇలా ఎన్నో విషయాల్లో తనదైన మార్కును చూపించి అప్పటికప్పుడు ఫలితాల రూపు రేఖలను మార్చేశారు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ అయిదే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. […]
[…] CM Jagan- BJP: ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయి. కేంద్రం ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాదిలో మంచి ఫలితాలు రావనే సంకేతాలు వెలువడుతున్న సందర్భంలో దక్షిణాదిపై ఆధారపడక తప్పదని భావిస్తోంది. ఇందు కోసమే ఈ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రేమ కురిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాట్లలో తలమునకలైన నేపథ్యంలో బీజేపీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అందుకే ఏపీని తన దారిలో ఉంచుకోవాలని భావిస్తోంది. […]