పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ మూవీ 2022 ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతోంది. ఈ తెలుగు సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఈనెల 25న రిలీజ్ కు రెడీ చేశారు.

Bheemla Nayak Movie Dialogues
- రేయ్ డానీ బయటికి రారా నా కొడకా ..!
- నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట గా.. స్టేషన్ లో టాక్ నడుస్తుంది, నేను ఎవరో తెలుసా ధర్మేంద్ర, హీరో

Bheemla Nayak Wiki
-భీమ్లా నాయక్ ప్రారంభం ఎప్పుడు?
భీమ్లా నాయక్ మూవీ జనవరి 25, 2021న హైదరాబాద్ లో ప్రారంభమైంది. జనవరి 26 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా 2021 మార్చి చివర్లో వాయిదా పడింది.



జులై 12 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభించారు. భీమ్లా నాయక్ టైటిల్ తొలి సాంగ్ ను 2021 సెప్టెంబర్ 2న విడుదల చేశారు.
మలయాళ సినిమా అయ్యప్పమ్ కోషియమ్ కు రిమేక్ గా తెలుగులో ‘భీమ్లానాయక్’ మూవీ రూపొందుతోంది. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగు నేటివేటికి అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేశారు. దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాను దగ్గరుండి చూసుకుంటూ తీస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఫిబ్రవరి 21న నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Bheemla Nayak Cast

-నటీనటులు
భీమ్లా నాయక్: పవన్ కళ్యాణ్
డేనియల్ శేఖర్, రిటైర్డ్ ఆర్మీ అధికారి: రానా దగ్గుబాటి
నిత్యమీనన్
సంయుక్త మీనన్
బ్రహ్మానందం,
సముద్రఖని,
మురళీ శర్మ
బ్రహ్మాజీ
నర్రాశీను
-సాంకేతిక నిపుణులు
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
మాటలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం : సాగర్ కే చంద్ర
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: రవికే చంద్రన్
ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్
సమర్పణ: పీవీవీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి