ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేన?

ఏపీలో కరోనాను పట్టించుకునే నాథుడు ఉన్నాడో లేదో తెలియదుగానీ అక్కడి రాజకీయాలపై మాత్రం తెలుగు ప్రజలు ఆసక్తి చూపుతోన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల నిర్ణయానికి తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తుండగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ నేతలు రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతుండటం […]

Written By: Neelambaram, Updated On : August 1, 2020 2:50 pm
Follow us on


ఏపీలో కరోనాను పట్టించుకునే నాథుడు ఉన్నాడో లేదో తెలియదుగానీ అక్కడి రాజకీయాలపై మాత్రం తెలుగు ప్రజలు ఆసక్తి చూపుతోన్నారు. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల నిర్ణయానికి తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తాజాగా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ నేతలు స్వాగతిస్తుండగా టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ నేతలు రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?

మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర పడటంతో అమరావతి ఫైట్ క్లైమాక్స్ చేరింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీకీ చెందిన 20మంది ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారనే తెలుస్తోంది. ఈమేరకు గవర్నర్ ను కలిసి రేపు రాజీనామా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారట. టీడీపీ నేతల రాజీనామాలతో ఏపీలో ప్రధాన పక్షం ఖాళీ కానుంది. దీంతో ఆపాత్రను ఎవరు పోషిస్తారనే చర్చ మొదలైంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. కిందటి శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 151సీట్లు రావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక టీడీపీకి 23, జనసేనకు ఒక్క సీటు వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు. 23సీట్లున్న టీడీపీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో జగన్ సర్కార్ పై పోరాడుతుంది. అయితే టీడీపీ అధినేత సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా అమరావతి రాజధాని కోసం రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీ ప్రతిపక్ష హోదా ఖాళీ కానుంది. దీంతో ఏపీలో కేవలం ఒక్కసీటు ఉన్న జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది.

Also Read: రాజధాని అంశాన్ని వదిలిపెట్టి రైతులకు మేలుచేయండి

జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారనున్నారు. ఇది ఒకరకంగా జనసేనకు, రాపాక వరప్రసాద్ గోల్డెన్స్ ఛాన్స్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ నేతల రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం ఆరునెలల సమయం పడుతుంది. ఈ సమయాన్ని జనసేన పార్టీ, ఎమ్మెల్యే రాపాక సరైన పద్ధతిలో వినియోగించుకుంటే ఆపార్టీ ఏపీలో మరింత బలపడే అవకాశం ఉంది. జనసేన నుంచి గెలిచిన ఏకైన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు ఇప్పటికే జనాల్లో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష హోదా దక్కనుండటంతో రాపాక వరప్రసాద్ మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారనున్నారు.