Minister Amarnath Reddy: జనసేననాని పవన్ కళ్యాణ్ కోసమే జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించినట్టు ఉన్నారు. పేరుకే సామాజిక సమతూకం కానీ పవన్ ను పోటాపోటీగా తిట్టిన వారికే పెద్దపీట వేస్తున్నట్టు ఉన్నారు. ఏరికోరి కాపు యువ నాయకులను తన మంత్రివర్గంలో తీసుకున్నారు. గతంలో పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు పవన్ ను తిట్టడంలో ముందు వరుసలో ఉండేవారు. ఇప్పుడు గుడివాడ అమర్ నాథ్, రోజా, అంబటి రాంబాబును ప్రయోగిస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందిన అమర్ నాథ్, అంబటి రాంబాబులు పవన్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. పవన్ ప్రస్తుతం రైతుభరోసా యాత్ర చేపడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. దీనికి రాజకీయంగా కౌంటర్ ఇవ్వాల్సిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఒక అడుగు ముందుకేసి పవన్ వైవాహిక జీవితం గురించి, ఆయన రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. కొత్తగా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ తన శాఖ గురించి ఒక్క సారి కూడా మాట్లాడారో లేదో కానీ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్‌ను మాత్రం ఆడి పోసుకుంటున్నారు. నలుగురిని పెళ్లి చేసుకున్న ఏ మాత్రం నైతికత విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ఆయనకు వ్యక్తిత్వం లేదు. మంచి క్యారెక్టర్ అస్సలే లేదు. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ మా ప్రభుత్వంపైనా, జగన్ పైనా విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పైగా తాము చెబుతున్నది కాదు. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ స్వయంగా చెప్పారు. పవన్ ఎలాంటి వ్యక్తి అన్నది ఆమే స్వయంగా చెప్పారనిచెప్పుకొచ్చారు. తొలి భార్యది విశాఖపట్నం. ఆ తర్వాత రేణుదేశాయ్. ఇప్పుడు రష్యన్. అంటే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. అలా అందరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి జగన్ గురించి అనుచితంగా మాట్లాడుతున్నారని విమర్శించేశారు.
వ్యక్తిగతంగా టార్గెట్
రాజకీయాలను రాజకీయంగా చూడకుండా వ్యక్తిగత విమర్శలు కుటుంబాలపైకి వెళ్ళడంతో వైసీపీ నేతలు రాటుదేలిపోయారు. గతంలో నేరుగా జగన్ విమర్శించేవారు. అప్పుడు జనసేన అధినేత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లను ఎగదోస్తున్నారు. మంత్రి కామెంట్లపై జన సైనికులు బాధపడుతున్నారు. దీటైన కౌంటర్లు ఇస్తున్నారు.
అమర్ తండ్రి గుడివాడ గురునాథరావు కాంగ్రెస్ లో పని చేస్తే, తల్లి గారు తెలుగుదేశం పార్టీలో చేరారని గుర్తు చేస్తున్నారు. తమరు కూడా టీడీపీలో కౌన్సిలర్ పదవి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి వెలగబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో టిడిపి, బీజేపీకి, అవసరమైతే జనసేనకు వెళ్లరన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమర్ నాథ్ స్థాయికి మించి పొత్తుల గురించి వ్యాఖ్యలు చేయడం గురువింద గింజ సామెత గుర్తు చేస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో జన సైనికులు అమర్ నాథ్ కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరచూ పార్టీలు మారే గుడివాడ కుటుంబం పవన్ పై ఆరోపణలు సంధించడాన్ని కాపు సామాజికవర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ పదవి ఇచ్చారని..పవన్ పై వ్యక్తిగత విమర్శలు దిగడం మానుకోవాలని అమర్ నాథ్ కు సూచిస్తున్నారు. గతంలో తాను వైఎస్ కుటుంబానికి పెద్ద పాలేరు అని తన స్థాయిని దిగజార్చుకున్న తాజా మాజీ మంత్రి పెర్ని నాని బాటలో అమర్ నాథ్ నడుస్తారో లేకుంటే పవన్ విషయంలో కాస్తా పునరాలోచించుకొని వెనక్కి తగ్గుతారో చూడాలి మరీ.
Also Read: Jagan Prashant Kishor: నిప్పులేనిదే పొగ రాదు.. కాంగ్రెస్ తో పొత్తు జగన్, పీకే ద్వయం వ్యూహమేనా?