Chiranjeevi- Janasena: ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నానుంచి దూరం కాలేదు’ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ డైలాగ్ ప్రస్తుత రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇస్తారన్న చర్చ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ డైలాగ్‌పై వివిధ రకాల విశ్లేషణలూ వస్తున్నాయి. రీఎంట్రీ తమ్ముని పార్టీ జనసేతో ఉంటుందా లేక బీజేపీతోనా లేక అధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీతోనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైన ప్రస్తుత తరుణంలో చిరంజీవి డైలాగ్ మరింత హీట్ పెంచింది.
రీఎంట్రీ సాధ్యమేనా?
మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ పార్టీని తర్వాత వివిధ కారణాలతో 2014లోగా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పిన చిరంజీవి, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదేవిధంగా ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ కూడా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు తమ డైలాగ్స్‌తో ఇలా సంకేతాలు పంపడం ఎప్పటి నుంచో ఉందో. ఎంజీ.రామచంద్రన్ కాలం నాటి నుంచే ఈ సంప్రదాయం వస్తోంది. సినిమాను ఒక మీడియాగా చేసుకుని పొలిటికల్ మెస్సేజ్ ఇస్తుంటారు. చిరంజీవి కూడా పొలిటికల్ రీఎంట్రీ అయ్యే అవకాశం ఉన్నందునే ఈ డైలాగ్ రిలీజ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాలో అనేక డైలాగ్స్ ఉన్నప్పటికీ కావాలనే చిరంజీవి ఈ డైలాగ్‌ను రిలీజ్ చేసి.. పొలిటికల్ చర్చకు తెరలేపారని తెలుస్తోంది. ఈ డైలాగ్ ప్రభావం తన సినిమాతోపాటు తన పొలిటికల్ రీఎంట్రీకి దోహదపడుతుందని మెగాస్టార్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Chicken Skin: చికెన్ స్కిన్ తో తింటే నష్టమా? లాభమా?
పునరాగమనం.. ఏ పార్టీ నుంచి?
ఒకవైపు చిరంజీవి డైలాగ్ సంలనం రేపుతుండగానే.. ఇంకోవైపు మెగాస్టార్ రీఎంట్రీ ఏపార్టీ ద్వారా ఉంటుందన్న చర్చ జోరందుకుంది.
– ప్రస్తుతం న్యూట్రల్‌గా ఉన్న చిరంజీవిని తమవైపు తిప్పుకుని లబ్ధి పొందాలని ఏపీ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ, కేంద్రంలో అధికాంలో ఉన్న బీజేపీ భావిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపాలని ఒక దశలో వైఎసాసర్‌సీపీ భావించింది. ఈమేరకు చిరంజీవిని కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. చిరంజీవి కూడా వైసీపీకి దగ్గరగా ఉన్నట్లే కనిపించారు. మూడు రాజధానుల అంశాన్ని కూడా అప్పట్లో ఆయన స్వాగతించారు. ఏడాది క్రితం సతీ సమేతంగా సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచే రీ ఎంట్రీ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
– ఇటీవల బీజేపీ కూడా చిరంజీవిని పార్టీకి దగ్గర చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. చిరంజీవి పార్టీలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దక్షిణాదిన బీజేపీకి మైలేజీ వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రధాని సభకు ఆహ్వానించారన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ బీజేపీ ఆఫర్‌ను చిరంజీవి సున్నితంగా తిరస్కరించారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతోనే బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్, నితిన్ ఇతర సినీ హీరోలవైపు చూస్తున్నట్లు పొలిటికల్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
జనసేనకు మైలేజీ..
చిరంజీవి తాజా డైలాగ్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు మైలేజీ వస్తుందని విశ్ళేషకులు అభిప్రాయపడుతున్నారు. రీ ఎంట్రీ కూడా తమ్ముడి పార్టీ నుంచే ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ, వైసీపీ ఆఫర్లను తిరస్కరించిన నేపథ్యంలో ఆయన జనసేనే తన నీఎంట్రీకి సరైన వేదిక అని భావిస్తున్నట్లు జనసేన నాయకులు పేర్కొంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయం పరంగా చూస్తే కూడా ఇది నిజమే అనిపిస్తుంది. వైసీపీ, బీజేపీకి దూరంగా ఉంటున్న చిరంజీవి, తాను కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రజారాజ్యాన్ని పునరుద్ధరించే ఆలోచన అవకాశం లేదు. కాబట్టి తన తమ్ము పార్టీ జనసేనతోనే రీఎంట్రీ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అందుకే జనసేనకు మైలేజీ వచ్చేలా, గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్ చేసుకునేలా రెండు విధాలా పనికొచ్చే డైలాగ్‌ను విడుదల చేశారని అభిప్రాయపడుతున్నారు. దీంతో జనసేనకు మైలేజ్ కూడా పెరుగుతుందని అంటున్నారు.
Also Read: RRR Oscar Hopes : ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయి… ఇలా బరిలో దిగవచ్చు!
Recommended videos:
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Jana senas vote bank will increase with chiranjeevis comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com