Jana Sena Formation Day: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయముంది. కానీ ఇప్పటినుంచే కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జనసేన అందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న నిర్వహించే ఆవిర్భావ సభతో ఎన్నికల సంగ్రామం మొదలు కానుంది. ఈ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రసంగం చేయనున్నట్లు జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా సభ నిర్వహణ కోసం పవన్ కల్యాణ్ అన్న నాగబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అటు పార్టీ శ్రేణులనుసమీకరించేందుకు కీలక నేత నాదెండ్ల మనోహర్ సమాలోచనలోపడ్డారు.
సార్వత్రిక ఎన్నికలో లక్ష్యంగా జనసేన ఆవిర్భావ సభ జరగనుందని తెలుస్తోంది. ఈ సభా ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును పెట్టారు. ఈ సభ నిర్వహణ కోసం 12 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన సభల కంటే ఈ ఆవిర్భావ సభ కీలకం కానుందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పవన్ చేసే ప్రసంగంలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళికను పవన్ ఇదే రాజకీయ వేదిక నుంచి క్లారిటీ ఇవ్వనున్నారు.
ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు కొనసాగించిన పవన్ గత కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీజేపీతో రాంరాం అనే విషయాన్ని ఈ సభలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పనిచేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నాయకులు ఈ విషయంపై పరోక్షంగా స్పష్టత ఇచ్చారు. కానీ పవన్ మాత్రం ఇప్పటికీ స్ఫష్టం చేయలేదు. అయితే 14న ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ రాజకీయ సమీకరణ పార్టీ ద్వారా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా తమతో కలిసొచ్చే వర్గాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కలిపి ప్రతి జిల్లాల్లోనూ జనసేన పొలిటికల్ మీటింగ్ లు పెట్టారు.
Also Read: Kapu Community : రెడ్డిలు, కమ్మలకు వేలకోట్లు.. కాపులకు పిసిరంత? జగన్ కు కాపులు అవసరం లేదా?
పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు తీస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఇకనుంచి పార్టీ పటిష్టత కోసం జనంలోకి వెళ్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచిస్తారని అంటున్నారు. పవన్ కల్యాణ్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు ఈ సభలో వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వినే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం చేపట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు.
గత ఎన్నికల్లో పార్టీ ఒకే సీటును గెల్చుకుంది. కానీ ఈసారి అలా కాకుండా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ సూచిస్తారట. అందుకు అవసరమైన సమీకరణాలను ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా కాపునేతలతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెరమీదకు తెచ్చే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ లకు రెండు సామాజిక వర్గాలు అండగా నిలిచే అవకాశం ఉన్నందున ఇప్పుడు జనసేన కూడా ఆ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆ స్థాయిలో ఓట్లు సీట్లు వచ్చినందున ఇప్పడు అదే ఫార్ములాను పవన్ పాలోకానున్నారు. ఇక పవన్ ఈ సభ ద్వారా ఎలాంటి ప్రసంగం చేస్తారోనని ఇప్పటికే జనసైనికుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే సభపై క్లారిటీ రావాలంటే మాత్రం 14 వరకు ఆగాల్సిందే.
Also Read: Bandi Sanjay Tweet On KCR Health: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్