https://oktelugu.com/

Biggest Disaster Movies In Tollywood: టాలీవుడ్ లో కోటి నుంచి రూ.71కోట్ల దాకా భారీ న‌ష్టాలు తెచ్చిన మూవీలు ఇవే..

Biggest Disaster Movies In Tollywood: సినిమా తీసి విడుద‌ల చేసే దాకా ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. స్టార్ హీరో, డైరెక్ట‌ర్ల ఆ మూవీలో ఉంటే మాత్రం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇలా అంచ‌నాల‌ను అమాంతం పెంచేసి విడుద‌లైన త‌ర్వాత మాత్రం దారుణంగా ప్లాప్ అయి న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీలు కోకొల్ల‌లు. ఇలా న‌ష్టాల బాట‌లో కోటి నుంచి రూ.70కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీల గురించి తెలుసుకుందాం. ఇలా కోటి రూపాయ‌ల న‌ష్టం తీసుకొచ్చిన […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 12, 2022 / 09:28 AM IST
    Follow us on

    Biggest Disaster Movies In Tollywood: సినిమా తీసి విడుద‌ల చేసే దాకా ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. స్టార్ హీరో, డైరెక్ట‌ర్ల ఆ మూవీలో ఉంటే మాత్రం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఇలా అంచ‌నాల‌ను అమాంతం పెంచేసి విడుద‌లైన త‌ర్వాత మాత్రం దారుణంగా ప్లాప్ అయి న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీలు కోకొల్ల‌లు. ఇలా న‌ష్టాల బాట‌లో కోటి నుంచి రూ.70కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చిన మూవీల గురించి తెలుసుకుందాం.

    NIPPU RAVVA

    ఇలా కోటి రూపాయ‌ల న‌ష్టం తీసుకొచ్చిన సినిమాల్లో అంతం, ఆప‌ద్భాంద‌వుడు మూవీలు ఉన్నాయి. ఇక 1993లో వ‌చ్చిన నిప్పుర‌వ్వ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. బాల‌య్య హీరోగా వ‌చ్చిన మూవీ ఇది. ఇందులో రూ.2కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు వ‌చ్చాయి. ఇక చిరంజీవి న‌టించిన బాగ్ బాస్ మూవీ కూడా దారుణంగా ప్లాప్ అయింది. దీని న‌ష్టాలు రూ.4కోట్ల వ‌ర‌కు ఉన్నాయి.

    Also Read: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’

    నాగార్జున హీరోగా వ‌చ్చిన ర‌క్ష‌కుడు మూవీ రూ.7 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. దీని త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మృగ‌రాజు మూవీ ఎన్నో అంచ‌నాల‌ను పెంచి చివ‌ర‌కు దారుణంగా ప్లాప్ అయింది. దీని న‌ష్టాలు రూ.10కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. ఇక ప‌వ‌ర్ స్టార్ హీరోగా, డైరెక్ట‌ర్ గా చేసిన మూవీ జానీ. ఈ మూవీ ప్లాప్ అయి రూ.13కోట్ల దాకా న‌ష్టాలు వ‌చ్చాయి.

    RAKSHAKUDU

    బాల‌కృష్ణ హీరోగా వచ్చిన ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు మూవీ దారుణంగా ప్లాప్ అయి రూ.15కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. దీని త‌ర్వాత కూడా ఆంధ్రావాలా, సైనికులు లాంటి మూవీలు కూడా రూ.15కోట్ల న‌ష్టాలు తెచ్చాయి. ఇదే బాల‌కృష్న న‌టించిన ఒక్క మ‌గాడు మూవీ కూడా రూ.17కోట్లు న‌ష్టాలు తెచ్చింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్, మ‌హేశ్ మూవీలు పులి, ఖ‌లేజా మూవీలు రూ.22కోట్ల న‌ష్టాలు తెచ్చాయి.

    PALANATI BRAHMANAIDU

    ఇక మ‌హేశ్ బాబు న‌టించిన వ‌న్ నేనొక్క‌టినే మూవీ రూ.42కోట్ల వ‌ర‌కు భారీ న‌ష్టాలు తీసుకువ‌చ్చింది.ఇక ప‌వ‌న్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ రూ.45కోట్ల దాకా వ‌సూలు చేసింది. దీని త‌ర్వాత ఇదే మ‌హేశ్ బాబు చేసిన బ్ర‌హ్మోత్స‌వం రూ.54కోట్ల భారీ న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. ఇక ఇదే మ‌హేశ్ బాబు, మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన స్పైడ‌ర్ మూవీ అత్యంత భారీ న‌ష్టాలు మిగిల్చింది. రూ.60కోట్ల దాకా న‌ష్టాలు తీసుకు వ‌చ్చింది. ఇక దీన్ని మించి నష్టాలు తెచ్చిన మూవీ అజ్ఞాత వాసి. ఈ మూవీ టాలీవుడ్ లో అత్యంత దారుణంగా న‌ష్టాలు తెచ్చిన మూవీ. ఈ మూవీ రూ.67కోట్ల దాక న‌ష్టాలు తెచ్చిపెట్టింది. వీట‌న్నింటికంటే ఫైన‌ల్ గా చెప్పుకోవాల్సిన మూవీ సాహో. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.71కోట్ల న‌ష్టం తీసుకు వ‌చ్చింది.

    Also Read:  అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్లాను – పూజా హెగ్డే

    Tags