https://oktelugu.com/

బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం.. ఆయన దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబుతో డీల్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మిమ్మల్ని ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే చూపిస్తా అని బోయపాటి స్క్రిప్ట్ చెప్పినప్పుడే బాలయ్యకి క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఓకే చెప్పిన బాలయ్య, ఇప్పుడు మాత్రం నో […]

Written By:
  • admin
  • , Updated On : August 11, 2020 / 08:52 PM IST
    Follow us on


    నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం.. ఆయన దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దానికి తగ్గట్లుగానే బాలయ్య బాబుతో డీల్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెబుతారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మిమ్మల్ని ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే చూపిస్తా అని బోయపాటి స్క్రిప్ట్ చెప్పినప్పుడే బాలయ్యకి క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఓకే చెప్పిన బాలయ్య, ఇప్పుడు మాత్రం నో చెబుతున్నాడట. ఇప్పటికే ఇద్దరం రెండు సినిమాలు చేశాము, మళ్ళీ అలాంటి యాక్షన్ సినిమానే చేస్తే జనం చూడరేమో.. ఎంత కాదనుకున్నా ఈ లాక్ డౌన్ లో తెలుగు ప్రేక్షకులు కూడా వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. ఇప్పుడు వారిని మెప్పించడం మాములు విషయం కాదు.

    Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

    తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకు యాక్షన్ సినిమానే చేయడం.. అని బాలయ్య తన వెర్షన్ ను చెబుతున్నాడట. నిజానికి బాలయ్య చెప్పింది అక్షర సత్యం. పైగా బోయపాటి సినిమాలో యాక్షన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే విమర్శ ఎలాగూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నా.. వీరి కలయికలో యాక్షన్ సినిమా అంటే కచ్చితంగా రెగ్యులర్ గానే ఉంటుంది. అన్నిటికి మించి కొత్తగా చేయాలనేది బాలయ్య తాపత్రయం. అందుకే కథ వినగానే పాత్రకు తగ్గట్లు గుండు కూడా కొట్టించుకున్నాడు. ఏమైనా ఎప్పటికప్పుడు తన చిన్న పిల్లాడి మనసును బాలయ్య చాటుకుంటూ తన అభిరుచిని వ్యక్త పరుస్తూనే ఉంటాడు. ఒక్కటి మాత్రం నిజం.. బాలయ్యను డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిదే.

    Also Read: మహేశ్‌తో సినిమాపై రాజమౌళి సైలెన్స్‌ ఎందుకంటే..

    పైగా బాలయ్య మాస్ హీరో అని ఒప్పుకుని తీరాలి. బాలయ్య అభిమానులకు ఆయన మాస్ కావాలి. కానీ బాలయ్యకు మాత్రం ఇప్పుడు కొత్తదనం కావాలి. అయితే బాలయ్య కొత్తదనం కోసం చూపించే ఇంట్రస్ట్, కాంబినేషన్ మీద కూడా చూపిస్తే.. నిజంగా బాలయ్యకు మునపటి స్టార్ వాల్యూ వచ్చేస్తోంది. స్టార్ డైరెక్టర్స్ తో బాలయ్య సినిమాలను సెట్ చేసుకుంటే.. బాలయ్య మార్కెట్ కూడా పెరుగుతుంది. మరి బాలయ్య, ముందుగా తన మార్కెట్ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.