Jammu Kashmir Transformation: మన స్వస్థలాన్ని వదిలి వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుంది.. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ మన పురిటి గడ్డకు వస్తే ఎంతటి ఆవేదన ఉంటుంది.. ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అప్పట్లో సునామీ వచ్చినప్పుడు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత సునామీ వచ్చిన రోజున గుర్తుకు తెచ్చుకొని చెన్నై వస్తుంటారు. తమ వాళ్ళు కళ్ళముందే చనిపోవడంతో.. ఆ బాధను తట్టుకోలేక.. సముద్రాన్ని చూసి విలపిస్తుంటారు. ప్రకృతి విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అటువంటిది సాటి మనుషులు దారుణానికి పాల్పడితే.. మారణ హోమానికి కారణమైతే.. వారి వల్ల ఆప్తులను కోల్పోయి.. కట్టుబట్టలతో వేరే ప్రాంతాలకు వెళ్తే.. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. అటువంటి బాధను దశాబ్దాలుగా మోశారు కాశ్మీర్ పండిట్లు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. జమ్ము కాశ్మీర్లో ఎన్నికలు జరిగిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి మాదిరిగా పరిస్థితి ఒకప్పటి మాదిరిగా లేదు. తాజా పరిస్థితులు అక్కడ మారిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు జమ్ము కాశ్మీర్ తిరిగి వస్తున్నారు. అక్కడ మూతపడిన మందిరాలను తెలుస్తున్నారు. గుడులను శుభ్రపరుస్తున్నారు. ఆలయాలను పూర్తిగా పునర్నిర్మిస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కాశ్మీర్ పండిట్లకు స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా సహకరిస్తున్నారు. 19 89, 90 కాలంలో ఏ ముస్లింలు అయితే కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టారో.. వారే ఇప్పుడు కాశ్మీర్ పండిట్లకు సహకరిస్తున్నారు.
ఇటీవల నార్త్ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో చందిగ్రామ్ మందిరాన్ని పున ప్రతిష్టించారు.. దీనికోసం స్థానికంగా ఉన్న ముస్లింలు కాశ్మీర్ పండిట్లకు సహకరించారు.. బారా ముల్లా జిల్లాలోని కచ్వా ప్రాంతంలో వినాయకుడి ఆలయాన్ని కూడా బాగు చేశారు. ఈ ఆలయాన్ని వదిలి వెళ్ళిన తర్వాత పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి అధికారులు చుట్టూ కంచె మాత్రమే నిర్మించారు. కాశ్మీర్ పండిట్లు ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. ఫలితంగా ఆలయం ఇటీవల పున ప్రారంభమైంది.
ఆలయాలను పునరుద్ధరించడం మాత్రమే కాకుండా.. గతంలో ఉన్న లెక్కలను సైతం కాశ్మీరీ పండిట్లు, హిందువులు బయటికి తీస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఆలయాల కోసం గతంలో ఉన్న 3,729 కనాల్స్ భూమిని కేటాయించినట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ముస్లింలు లేరు. గతంలో మాదిరిగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం లేదు. మొత్తంగా చూస్తే జమ్ము కాశ్మీర్లో ఒకప్పటి వాతావరణం కనిపిస్తోంది. అందువల్లే గతంలో నిర్వహించినట్టుగానే జాతరలు,. వేడుకలు జరుపుకుంటామని కాశ్మీర్ హిందువులు, పండిట్లు పిలుపునిస్తున్నారు.. జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్‌లోని హిందువులు ఒకప్పుడు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దుర్గాష్టమి వంటి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని కాశ్మీరీ పండిట్లు చెబుతున్నారు.
వాస్తవానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ వారు కలలో కూడా ఊహించలేదు. తాము తమ సొంత ప్రాంతాలకు వెళ్తామని కాశ్మీర్ పండిట్లు ఏమాత్రం అంచనా వేయలేదు. లాల్ చౌక్ ప్రాంతంలో జాతీయ జెండా ఎగురుతుందని ఏ భారతీయుడు కూడా అంచనా వేయలేదు. కానీ ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే జమ్ము కాశ్మీర్ లో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. ఇది మార్పునకు సంకేతం. రేపటి అందమైన భవిష్యత్తుకు సజీవమైన ముఖచిత్రం.