Jammu And Kashmir: ఉగ్రవాదుల్లో స్పైడర్ సినిమాలో ఎస్ జె సూర్య తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. పైకి లక్ష్యాలు.. ఇంకా ఏవేవో చెబుతుంటారు కాని.. ఎదుటి మనుషులను చంపి సాధించేది ఏముంటుంది? దానికి లక్ష్యమని పేరు పెట్టుకోవడం ఏమిటి? ఏదైనా ఒక మనిషి దారుణాలకు పాల్పడితే.. క్రూర ఘటనలలో పాలుపంచుకుంటే అతడిని అంతమొందించొచ్చు. సమాజానికి ప్రతిబంధకంగా మారాడు కాబట్టి లక్ష్యంగా చేసుకోవచ్చు. కానీ పహల్గాం ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను వీక్షించడానికి వచ్చిన సందర్శకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఏముంటుంది… ఈసారి ఏకంగా టూరిస్టులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.. దాదాపు 28 మందిని అత్యంత క్రూరంగా చంపేశారు.. జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఈ క్రూరం కలవర పాటుకు గురిచేస్తోంది . అంతేకాదు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తోంది. అసలు ఈ ఘటన తలుచుకుంటేనే ఇక్కడ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తారో.. ఎక్కడ తమ ప్రాణాలు తీస్తారోనని తీవ్రంగా భయపడుతున్నారు.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి: కాశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులు
నాడు ఏం జరిగిందంటే..
ప్రస్తుతం మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషవాన్స్ పర్యటిస్తున్నారు. సరిగ్గా ఆయన పర్యటన సమయంలోనే పహల్గాం ప్రాంతంలో దాడి జరగడం విశేషం.. అయితే ఇప్పుడు మాత్రమే కాదు సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. పాతిక సంవత్సరాల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ కలెక్టర్ మన దేశంలో పర్యటిస్తుండగా ఘోరమైన దాడి జరిగింది. నాడు ఉగ్రవాదులు భారత ఆర్మీ దుస్తులు ధరించి అనంత నాగ్ ప్రాంతంలోని చిట్టి సింగ్ పూరా ప్రాంతానికి వచ్చారు. పురుషులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. వారిని గురుద్వారా ముందు లైన్ లో నిలబెట్టారు. సినిమా తరహాలోనే తుపాకులను ఎక్కుపెట్టి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. నాటి ఆ ఘోరమైన దాడిలో 35 మంది సిక్కులు కన్నుమూశారు.. నాటి ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిగ్గా అమెరికాకు చెందిన అధిపతులు లేదా ఉపాధిపతులు మన దేశంలో ప్రకటించడానికి వచ్చినప్పుడల్లా ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఉగ్రవాదులకు పరిపాటిగా మారింది. ఒక రకంగా ప్రపంచ దేశాల ముందు భారత్ ను పలుచన చేయడానికి ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. భారత సైన్యం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొంతమంది పేదలను ఉగ్రవాదులు ఆకర్షిస్తున్నారు. వారికి డబ్బు ఆశ చూపించి దాడులకు పాల్పడేలా చేస్తున్నారు. భారత్ పై లేనిపోని విషాన్ని వారి మెదళ్లల్లో నూరిపోస్తున్నారు. తద్వారా ఇలాంటి దాడులకు పాల్పడే విధంగా చేస్తున్నారు.. ఈ దాడుల వల్ల భారత్ ప్రాణ నష్టాన్ని మాత్రమే కాకుండా.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందువల్లే ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు ఇప్పుడు రెడీ అయింది.. పహల్గాం ఘటన తర్వాత.. భారత ఆర్మీ ఉగ్రవాదులే టార్గెట్ గా అడుగులు వేస్తోంది.