Nani : ‘గేమ్ చేంజర్’ లాంటి ఫ్లాప్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) చేస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi Movie). ఉప్పెన వంటి భారీ హిట్ తర్వాత బుచ్చి బాబు(Buchi Babu Sana) దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఇది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ గ్లింప్స్ వీడియో చివర్లో వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. కానీ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటిస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రం కూడా మార్చి 26 న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి కూడా గ్లింప్స్ దగ్గర నుండే అంచనాలు భారీగా పెరిగాయి. నాని ని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అని అందరూ ప్రశంసించారు.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు క్లాష్ అయితే కచ్చితంగా రెండిటికి నష్టం ఉంటుంది. నాని మార్కెట్ కంటే రామ్ చరణ్ మార్కెట్ మూడింతలు ఎక్కువ. క్లాష్ వస్తే పెద్ది చిత్రానికి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఈ క్లాష్ పై హీరో నాని ‘హిట్ 3’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘మేము మార్చి 26 న మా చిత్రాన్ని విడుదల చేయడానికి చాలా కమిటెడ్ గా పని చేయాలనీ అనుకుంటున్నాము. పెద్ది తో క్లాష్ ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మా సినిమా చాలా పెద్దది, పెద్ది కూడా చాలా పెద్ద సినిమా, రెండు సినిమాలు క్లాష్ అయినా ఇబ్బంది ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కూడా సంక్రాంతి లాగా మారిపోయింది, ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు రావొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.
నాని మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన చెప్పిన సమాధానం చాలా సబబు గానే ఉంది కానీ మెగా అభిమానులు మాత్రం కాస్త నొచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ని హీరో గా పెట్టి సినిమా తీయబోతున్న నాని నుండి ఇలాంటి సమాధానం ఊహించలేదని, గౌరవం ఇచ్చి తప్పుకుంటాడేమో అని అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సాధ్యమైనంత వరకు ఈ రెండు చిత్రాల్లో ఎదో ఒకటి కచ్చితంగా వెనక్కి వెళ్తుంది. ‘పెద్ది’ సినిమా ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోనుంది. కానీ ‘ది ప్యారడైజ్’ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘హిట్ 3’ విడుదలై ఒక నెల గడిచిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది, కాబట్టి ప్యారడైజ్ పూర్తి అవ్వడానికి చాలా సమయం పట్టొచ్చు.
Also Read : పెద్ది’ షాట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎలా క్రియేట్ చేశారంటే!
