Jallianwala Bagh: జలియన్‌వాలాబాగ్(Jalianwalabag).. స్వాతంత్రోద్యమంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ మర్చిపోలేని ఘటన ఇది. 1919లో జరిగిన ఈ ఘటనలో 1,500 మందికిపైగా మరణించారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. బ్రిటీష్ పాలకుల దాష్టీకానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిది. ఈ ఘటన జరిగి ఏప్రిల్ 13కు 106 ఏళ్లు
జలియన్ వాలాబాగ్ ఘటన.. స్వాతంత్య్ర ఉద్యమంలో జరిగిక కొన్ని ఘట్టాల్లో ఇదీ ఒకటి. అహింసా మార్గంలో స్వాతంత్రోద్యమం జరిగినా.. బ్రిటిష్(BristisH) పాలకుల వైఖరి కారణంగా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. అందులో జలియన్‌వాలాబాగ్ ఒకటి. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలా బాగ్ ఉదంతం బ్రిటిష్ వలస పాలనలో చీకటి అధ్యాయంగా(Black Incident) మిగిలిపోయింది. అమృత్‌సర్(Amruthsir)లోని ఈ తోటలో ప్రశాంతంగా సమావేశమైన భారతీయులపై జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటిష్ సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. నిరాయుధులైన వేలాది మందిపై జరిగిన ఈ దాడిలో దాదాపు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా, 1,200 మంది గాయపడ్డారు. స్వాతంత్య్ర సమరంలో భాగస్వాములైన అమాయకులపై ఈ దారుణం జరిగి 106 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంది.
క్షమాపణ డిమాండ్..
ఈ ఘటనను బ్రిటన్ చరిత్రలో మాయని మచ్చగా అభివర్ణిస్తూ, యూకే పార్లమెంట్(UK Parlment)లో అభ్యర్థనలు వెల్లువెత్తాయి. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మాన్ దిగువ సభలో ప్రసంగిస్తూ, ‘‘నాటి బ్రిటిష్ పాలకుల అరాచకాలను అంగీకరించి, ఈ దాడికి క్షమాపణ చెప్పాలి. తూటాలు అయిపోయే వరకు కాల్పులు జరపాలని డయ్యర్ ఆదేశించారు. ఈ హేయమైన చర్యకు ఆయన తగిన మూల్యం చెల్లించారు. బ్రిటన్ ఇప్పటికైనా బాధ్యత స్వీకరించాలి,’’ అని పేర్కొన్నారు. ఈ డిమాండ్‌కు మరో సభ్యుడు లూసీ పావెల్ మద్దతు తెలిపారు.
2019లోనూ..
2019లో అప్పటి బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఈ ఘటనను చీకటి అధ్యాయంగా అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం తరఫున అధికారిక క్షమాపణ రాలేదు. ఏప్రిల్ 13న పార్లమెంట్ సమావేశాలు లేనప్పటికీ, ఆ రోజున అధికారిక ప్రకటన ద్వారా క్షమాపణ చెప్పాలని బ్లాక్మాన్ సూచించారు. ఈ ఉదంతం బ్రిటిష్ పాలనలో అనేక దురాగతాల్లో ఒకటిగా నిలిచిపోయింది. నాటి దాడి బాధితుల సంఖ్య, దాని తీవ్రత గురించి చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
భారత్‌లో ప్రతిధ్వని..
క్షమాపణ డిమాండ్ భారత్‌లోనూ ప్రతిధ్వనిస్తోంది. స్వాతంత్య్ర సమర యోధుల బలిదానాన్ని గౌరవిస్తూ, బ్రిటన్ తన చారిత్రక బాధ్యతను నెరవేర్చాలని భావిస్తున్నారు. 106 ఏళ్ల తర్వాత కూడా ఈ గాయం మానలేదని, క్షమాపణతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.