Homeజాతీయ వార్తలుKannada Language: కన్నడ భాష అమలులో నిర్లక్ష్యం వహిస్తే అంతే?

Kannada Language: కన్నడ భాష అమలులో నిర్లక్ష్యం వహిస్తే అంతే?

Kannada Language: మాతృభాష మీద మమకారం ఉండాలి. అప్పుడే భాష బతుకుతుంది. మాతృభాషల విషయంలో కన్నడ, తమిళుల తరువాతే ఎవరైనా. అక్కడ మొత్తం బోర్డులన్నీ వారి మాతృభాషలోనే ఉంటాయి. ఇద్దరు తెలుగు వారు కలుసుకుంటే వారు ఆంగ్లంలో మాట్లాడుకుంటారు. కానీ తమిళులైనా, కన్నడీయులైనా వారి మాతృభాష తప్ప వేరే భాషలో మాట్లాడరు. వారికి ద్వితీయ భాష ఉండదు. ఒకటే వారి మాతృభాషే కావడం గమనార్హం. మన తెలుగు వారు మాత్రం మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో కన్నడ వారిలో ఉన్న ఐకమత్యం మనలో లేదని తెలుస్తోంది.

Also Read: Chiranjeevi Comments: చిరంజీవి వ్యాఖ్యలతో జనసేనకు పెరుగనున్న ఓటుబ్యాంకు? 

Kannada Language
Kannada Language

మాతృభాషపై మమకారం ఉంటే దాని అమలుపై ఎలాంటి చట్టాలు తీసుకోవడం లేదు. మన అసెంబ్లీలోనే చాలా మంది ఆంగ్ల పదాలు వాడుతుంటారు. అదే కర్ణాటకలో వారు మొత్తం వారి మాతృభాషలోనే ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా రూపొందించింది. పాలనలో అన్ని దశల్లో కన్నడ భాషను అమలు చేయాలని చిత్తశుద్ధిగా భావించింది. దీని కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వ్యవహారాల్లో కన్నడను అమలు చేయాలని కొత్త చట్టానికి శ్రీకారం చుట్టింది.

Also Read: Bigg Boss Telugu 6- Sri Satya: ఇదేం సాహసం బాబోయ్… హోస్ట్ నాగార్జున తప్పుపడుతూ కంటెస్టెంట్స్ శ్రీసత్య సటైర్స్..!

కన్నడ భాషను అమలును పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలు నియమించనున్నారు. మొదటి సారి తప్పు చేస్తే హెచ్చరికలు చేసి వదిలేస్తారు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా విధింపు, ఇంక్రిమెంట్లలో కోత లాంటివి విధిస్తారు. మూడో సారి తప్పు చేస్తే జైలు శిక్ష విధించేలా చట్టం తేనున్నారు.

Kannada Language
Kannada Language

ఇలా మాతృభాష అమలులో వారు తీసుకుంటున్న చర్యలు చూస్తే ముచ్చటేస్తోంది. అదే మన తెలుగులో ఎన్ని తప్పులు చేసినా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ఏ దశలోనూ మన తెలుగు అధికార భాషగా రాణించడం లేదు. ఆంగ్లమే మనపై పెత్తనం చేస్తోంది. పైగా ఆంగ్లం నేర్చుకోకపోతే ఉద్యోగావకాశాలు రానే ఉద్దేశంతో మాతృభాష తెలుగును పూర్తిగా మరిచిపోతున్నారు. మాతృభాషలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సైతం ఇవ్వడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో మన తెలుగు భాష కనుమరుగు కావడం కచ్చితంగా జరుగుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. పక్క వారిని చూసైనా నేర్చుకుంటే మంచిదని మాతృభాష ప్రేమికులు చెబుతున్నారు.

Recommended videos:

62ఏళ్ల వృద్ధుడి ప్రేమలో పడ్డ 18 ఏళ్ల యువతి || 18 Years Girl Loves 62 Years Old Man || Ok Telugu

అమ్మకానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు || Hyderabad Outer Ring Road || Viral News || Ok Telugu

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version