CM Jagan: ‘‘ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే బిడ్డలు శిక్షార్హులే. మలి దశలో వారికి బిడ్డల అండ అవసరం.. భార్య మాటలు విని తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా నేరమే’’ కొన్నాళ్ల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా పేర్కొన్న మాటలివి.

‘‘ఓ కోర్టులో తల్లిదండ్రుల్ని హత్య చేసిన ఓ కొడుకు కేసు విచారణ జరుగుతోంది. తల్లిదండ్రుల్ని హత్య చేశావా అని జడ్జి నిందితుడ్ని అడిగాడు. అవునని అంగీకరించాడు. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఇచ్చే సమయంలో.. ఆ నిందితుడ్ని జడ్జి అడిగాడు.. చివరిగా చెప్పుకునేది ఏమైనా ఉందా అని. తల్లిదండ్రులు లేని అనాథని.. కాస్త కనికరించండి అని వేడుకున్నాడట ఆ నిందితుడు. ఆ మాటలు విని జడ్జికి అక్కడే చెక్కరొచ్చినందత పనైంది’’ ఇది ఓ సెటైరిక్ కథే కానీ.. ఏపీలో ఇప్పుడు ఇలాంటి ఓ అనాథ బిడ్డ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. మీ బిడ్డకు తోడుగా ఉండండి అంటూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి బహిరంగసభల్లో సెంటిమెంట్ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డనని.. మీ బిడ్డనని అదే పనిగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన స్వయంగా ఎవరి బిడ్డో.. ఆ తల్లి మాత్రం ఇప్పుడు తెలంగాణ రోడ్లపై మరో బిడ్డ కోసం ఆవేదన చెందుతోంది. మీ కొడుకు సీఎం కదా అని మీడియా అడిగితే.. ఆ రాష్ట్రంతో.. జగన్మోహన్‌రెడ్డితో మనకేంటి సంబంధం అని నిర్మొహమాటంగానే చెబుతోంది. అంటే.. తన బిడ్డనే .. ఆ తల్లి వదులుకుంది. కానీ ఆ బిడ్డ మాత్రం మిగతా ప్రజలందర్నీ తనను బిడ్డలాగా చూసుకోమని బతిమాలుతున్నాడు. పేగు తెంచుకుని బిడ్డ విషయంలో తల్లే సంబంధం లేదని అనేసిందంటే.. ఆయన ఎంత చేసి ఉండాలి? ప్రజలకు ఇంకెంత చేసి ఉండాలి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అధికారం కోసం అనేక డ్రామాలు..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజన్న బిడ్డనని.. కేసుల్లో ఇరికించారని.. చంపబోయారని కోడికత్తి డ్రామాలు ఆడి.. తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు జగన్. దానిని నిలబెట్టుకోవడానికి ఇంకా చాలా చేయాలి. అధికారం అందిందని చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల్ని నిజంగానే ఈ బిడ్డ బాగా చూసుకున్నాడా.. చూసుకుంటే.. ఇప్పుడు ఇంత టెన్షన్ పడాల్సింది ఏముంది. సొంత ఆదాయం కోసం మద్యం ఆదాయం పెంచి పేదలను ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అందకుండా చేశారు. ప్రతీ విషయంలోనూ పన్నులు బాదేశారు. చిటికెడంత అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఎన్నో కోతలు పెట్టి.. ఇప్పుడు కొత్త బిడ్డ అంటూ సెంటిమెంట్ రాగం అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బిడ్డనని.. చెప్పుకుంటున్న జగన్‌మెహన్‌రెడ్డి ఆత్రం చూసి.. జనాలు నవ్వుకుంటున్నారు.

సెంటిమెంటుతో ఓట్లు పడతాయని..
సాధారణంగా సెంటిమెంటును ప్రతిపక్షంలో ఉన్నవారు రగిలిస్తారు. దానిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి సెంటిమెంటు రాగం అందుకున్నారు. ఇలాంటి సెంటిమెంట్లతో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు రాలతాయనుకుంటేం అమాయకత్వమేనని.. మంచి పాలన చేయకుండా.. ప్రజల్ని పట్టించుకోకుండా ఇప్పుడిలా బతిమాలుకుంటే ప్రయోజనం ఏమిటన్న నిట్టూర్పూ..సహజంగానే ఆయన సానుభూతిపరుల్లోనూ వస్తోంది.