Pawan Kalyan- Jagan: ఏపీలో ఓ రాజకీయ వికృత క్రీడ జరుగుతుంటుంది. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దానిని డైవర్ట్ చేసేందుకు అదే స్థాయి ఘటనకు అప్పుటికప్పుడు రూపకల్పన చేస్తుంటారు. గత మూడున్నరేళ్లుగా ఇటువంటివి చూస్తున్నాం. అధికారంలో రావడానికి పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు.. ఇప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు అమలు చేస్తున్నారు. యాంటీ గవర్న్ మెంట్ ఇష్యూ వచ్చిన ప్రతీసారి విపక్షాల్లో ఎవరో ఒకర్ని అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. నిన్న కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్రధాని మోదీ పవన్ కలిసేందుకు సమయమిచ్చారు. పవన్ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. ప్రధానితో భేటీకి వెయిట్ చేస్తున్నారు.అదే సమయంలో కూడబలుక్కొని మరీ తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేశారు. ఎటువంటి కారణం చెప్పకుండా, నోటీసు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

గత పక్షం రోజులుగా ప్రధాని విశాఖ పర్యటన మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పర్యటన ఏర్పాట్లు, వైసీపీ చేస్తున్న హడావుడి, రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ ఇష్యూలను బేస్ చేసుకొని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ చానల్ చూసినా విశాఖపైనే ఉంది. అటువంటిది రెండు రోజుల కిందట నుంచి ఈ అంశాలన్నీ మరుగునపడిపోయాయి. ప్రధానిని కలవాలని పవన్ కు పీఎంవో నుంచి సమాచారం అందిన వెంటనే మీడియా ఫోకస్ అంతా పవన్ పైనే పడింది. అసలు పవన్ ను ప్రధాని ఎందుకు కలవమన్నారు? పవన్ తో చర్చించేదేమిటి? రాజకీయంగా కీలక నిర్ణయాలు వచ్చే అవకాశముందా? వస్తే ఏమిటి? అన్న చర్చలు, కథనాలు మీడియా ప్రసారం చేసింది. మీడియాలో కూడా పవన్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా మిగిలారు. సహజంగా ఇది జగన్ తో పాటు వైసీపీ నేతలకు రుచించదు. అందుకే తమ పీకే సూచనలను పదునుపెట్టారు. సోషల్ మీడియాలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేశారు.
కిరణ్ రాయల్ ఇంట్లో ఉండగానే కొంతమంది పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు అడిగినా పోలీసులు ఏ సమాధానం చెప్పలేదు. క్షణాల్లో వచ్చి.. అంతే వేగంగా తీసుకెళ్లిపోయారు. జనసేన శ్రేణులకు తెలియడంతో వారు తిరుపతిలోని పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు. మేమేమీ అరెస్ట్ చేయలేదని.. చేస్తేగీస్తే నగిరి పోలీసులు చేసి ఉంటారని వారు లీకులిచ్చారు. ఇదే విషయాన్ని స్థానిక నాయకులు హైకమాండ్ కు సమాచారమందించారు. అయితే అప్పటికే పవన్ పై మీడియా ఫోకస్ అంతా ఉంది. అటు నీలి మీడియా సైతం తామెక్కడ వెనుకబడిపోతామని పవన్ పైనే కాన్సంట్రేషన్ చేసింది. అయితే ఈ విషయంలో జగన్ అండ్ కో రెండు ప్రయోజనాలను ఆశించినట్టు ఉంది. ఒకటి పవన్ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టడం, రెండూ మీడియా ఫోకస్ ను పవన్ నుంచి తప్పించడం. అయితే ఈ రెండూ జరగలేదు. పవన్ తాను అనుకున్నది, చేస్తానన్నది, అంతకంటే ఏపీలో ఉన్న విధ్వంస పాలన గురించి ప్రధాని మోదీకి చెప్పేశారు. అటు మీడియా కూడా కిరణ్ రాయల్ అరెస్ట్ ను లైట్ తీసుకుంది. స్క్రోలింగ్ లకే పరిమితం చేసింది.

అటు రాష్ట్ర ప్రజలు, చివరకు అధికార పక్షం సైతం మోదీ, పవన్ భేటీ గురించి ఆరాతీయడం మొదలు పెట్టారు. కొందరు అయితే మీడియాను వాచ్ చేస్తూ ఉండిపోయారు. ప్రధానిని కలిసిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడే వరకూ టీవీలకు అతుక్కుపోయారు. తాను చెప్పాలనుకున్నది చెప్పాను.. ఈ భేటీతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కూడా పవన్ ప్రకటించారు. చిన్నాచితకా చానళ్లు సైతం పవన్ ప్రెస్ మీట్ ను లైవ్ టెలికాస్ట్ చేశాయి. వాటని చూసిన జగన్ అండో కో అసహనానికి గురైనట్టు సమాచారం. తిరుపతిలో జనసేన నేతను అరెస్ట్ చేస్తే పవన్ ఊరుకుంటాడని ఎలా అనుకున్నారో తెలియదు. అటు టీఆర్పీ రేటింగుల కోసం తాపత్రయ పడే రోజులవి. అటువంటి ప్రధాని పిలిచి మరీ పవన్ ను కలిస్తే దానిని ఎలా టెలికాస్టు చేయకుండా ఉంటారో జగన్ అండ్ కో కే తెలియాలి. మొత్తానికి కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసి ఏదో చేయ్యాలనుకున్న వారికి.. ఈ తాజా పరిణామాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.