న్యాయవ్యవస్థ ద్వారా తన ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. దీనిపై ప్రముఖులు స్పందిస్తూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ దేశంలోనే ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను పెట్టి మరి సంచలన డిమాండ్ ను తెరపైకి తేవడం జాతీయ రాజకీయాలను షేక్ చేసింది.
"In a letter to CJI S.A. Bobde, AP CM Jagan Reddy accused Justice N.V. Ramana of corruption&of conspiring against his government on behalf of TDP leader Chandra Babu Naidu."
The allegations are serious & certainly require a quick, crebible & thorough probe https://t.co/sA8F7nNdQH— Prashant Bhushan (@pbhushan1) October 11, 2020
Also Read: ఏపీపై ఆర్‌ఎస్‌ఎస్ ఫోకస్..మతలబు ఏంటి?
జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డేకు రాసిన లేఖపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ప్రశాంత్ భూషణ్ అన్నారు. దీనిపై శరవేగంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దర్యాప్తు ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కాపాడినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు తరుఫున న్యాయస్థానాల్లో తన ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్ చేసిన ఈ ఫిర్యాదుపై కూడా విచారణ జరపాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమైంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించినట్టైంది.
ఇక బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సైతం ఈ వివాదంపై స్పందించారు. తెలుగులో స్వతంత్ర ప్రింట్ మీడియా లేకపోవడం.. తెలుగు ప్రజల దౌర్భగ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీడియా మాత్రం స్వతంత్రంగా పనిచేయలేకపోతోందని అన్నారు. వైఎస్ జగన్ రాసిన లేఖపై జాతీయ స్థాయిలో ఓ చర్చ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ న్యాయాధికారుల నియామక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: జేసి రెడ్డప్ప పని పడుతున్న జగన్. వ్యాపారాలను దెబ్బతీయడమే టార్గెటా?
ఇక జాతీయ చానెళ్లు కూడా ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై చర్చలు, డిబేట్లు పెడుతూ హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.