అమితాబ్ పై అప్యాయతను చాటుకున్న చిరంజీవి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బిగ్ బీ అమితాబచ్చన్.. మెగాస్టార్ చిరంజీవిలు అభిమానులచే లెజెండ్స్ గా కొనియాడబడుతున్నారు. ఒకరు బాలీవుడ్లో.. మరొకరు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో దశాబ్దాలుగా కొనసాగారు. ప్రస్తుత తరంలోనూ కుర్రహీరోలకు ధీటుగా వీరిద్దరి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయంటే వీరి స్టామీనా ఏంటో అర్థం చేసుకోవచ్చు. Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ ! చిరంజీవి-అమితాబ్ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’లో అమితాబ్ బచ్చన్ […]

Written By: NARESH, Updated On : October 11, 2020 3:25 pm
Follow us on

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బిగ్ బీ అమితాబచ్చన్.. మెగాస్టార్ చిరంజీవిలు అభిమానులచే లెజెండ్స్ గా కొనియాడబడుతున్నారు. ఒకరు బాలీవుడ్లో.. మరొకరు టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానంలో దశాబ్దాలుగా కొనసాగారు. ప్రస్తుత తరంలోనూ కుర్రహీరోలకు ధీటుగా వీరిద్దరి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయంటే వీరి స్టామీనా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ !

చిరంజీవి-అమితాబ్ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’లో అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ చేశాడు. చిరు కోరిక మేరకు అమితాబ్ సైరా నర్సింహారెడ్డి గురువు పాత్రలో కన్పించి అందరినీ అలరించాడు. చిరు సైతం అమితాబ్ ను గురువుగా భావిస్తున్నానని గతంలో పలుసార్లు చెప్పారు.

నేడు అమితాబ్ పుట్టినరోజును పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నా ప్రియమైన పెద్దన్నయ్య.. భారతీయ చిత్రపరిశ్రమకు బిగ్ బి.. టాలెంట్ కు పవర్ హౌస్.. అలాగే ఎప్పటికీ నా మార్గదర్శకులు అమిత్ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీ నటన.. తేజస్సుతో ప్రేక్షకులను అలరించాలని.. మరెన్నో సంవత్సరాలపాటు మాలో స్ఫూర్తి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశారు.

Also Read: బిగ్ బాస్-4: ఆ ఇద్దరిలో ఒకరు విజేత.. కిరీటం వాళ్లకేనా?

మెగాస్టార్ తోపాటు పలువురు సెలబ్రెటీలకు అమితాబచ్చన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. పూరి జగన్మాథ్.. బాబీ.. అజయ్ దేవగణ్.. హీరోయిన్లు మోహరీన్.. ఛార్మి..తదితరులంతా అమితాబ్ కు పుట్టిన రోజు విసెష్ చెప్పారు.