జగన్‌ లేఖ: ప్రశాంత్ భూషణ్‌ రచ్చ చేస్తున్నాడే?

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం జగన్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితోపాటు హైకోర్టు జడ్జిలపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు కాస్త ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా కుదిపేస్తోంది. జ‌గ‌న్ ఆ ఫిర్యాదు లేఖ‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డంపైనా న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు రాసిన లేఖ‌ను బ‌హిరంగ‌ప‌ర‌చ‌డం కోర్టు ధిక్కర‌ణ అవుతుందని కొందరు అంటుండగా.. అలా ఏమీ కాద‌ని మ‌రికొంద‌రు […]

Written By: NARESH, Updated On : October 14, 2020 4:13 pm
Follow us on

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం జగన్ చేసిన ఫిర్యాదు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితోపాటు హైకోర్టు జడ్జిలపై ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు కాస్త ఇప్పుడు న్యాయవ్యవస్థను కూడా కుదిపేస్తోంది. జ‌గ‌న్ ఆ ఫిర్యాదు లేఖ‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డంపైనా న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌కు రాసిన లేఖ‌ను బ‌హిరంగ‌ప‌ర‌చ‌డం కోర్టు ధిక్కర‌ణ అవుతుందని కొందరు అంటుండగా.. అలా ఏమీ కాద‌ని మ‌రికొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను బ‌లంగా వినిపిస్తున్నారు.

Also Read: జనసేనాని ఎందుకు సైలెంట్‌ అయ్యారు

ఇండియా టుడే చానల్‌ కూడా ఈ అంశంపై డిబెట్‌ నిర్వహించింది. చ‌ర్చలో పాల్గొన్న ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌ణ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించారు. కోర్టుల్లో అవినీతిపై మ‌రోసారి త‌న అభిప్రాయాన్ని ఆయ‌న కుండ‌బ‌ద్ధలు కొట్టారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సీజేఐకి లేఖ రాసి మంచి ప‌ని చేశార‌న్నారు. అలాగే ఆ లేఖ‌ను బ‌హిరంగ ప‌రిచి మ‌రింత మంచి ప‌ని చేశార‌ని ప్రశంసించారు.

జగన్ ఆ లేఖను బహిరంగ పరచకుంటే.. అంత సీరియస్‌ ఉండేది కాదన్నారు. అంతేకాదు.. ఇప్పుడీ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లింది కాబట్టి తప్పనిసరిగా విచారణ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. విచార‌ణ కోసం అంద‌రూ పట్టుబ‌ట్టాలని కోరారు.

Also Read: కరోనా ముప్పు గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..?

జ‌గ‌న్ రాసిన లేఖ‌పై అత్యంత నిజాయితీప‌రులైన ముగ్గురు రిటైర్డ్ జ‌డ్జీలతో విచార‌ణ క‌మిటీ వేయాల‌ని ప్రశాంత్ భూష‌ణ్ డిమాండ్ చేశారు. మొత్తానికి జడ్జీలపై పోరాడుతున్న సీఎం జగన్‌కు ప్రశాంత్‌ భూషణ్‌ సపోర్టు కూడా దొరికినట్లైంది. చివ‌రికి ఈ వ్యవ‌హారం ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియకుండా ఉంది.