మోడీ పాలనకు బ్రేకులు వేస్తున్న రైతులు

కేంద్రంలో సాఫీగా సాగుతున్న నరేంద్ర మేడీ పాలకు రైతులు బ్రేకులు వేస్తున్నారు. కేంద్ర తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పంజాబ్‌, హర్యానా రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మంగళవారం చేపట్టిన భారత్‌ బంద్‌లో అన్ని రాష్ట్రాల్లోని రైతులతో పాటు 14 రాజకీయ పార్టీలు పాల్గొనడం విశేషం. ఈ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయపోతే ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడిచిన ఎవుసం’ నిలవదనే సామెత నిజం అవుతుందేమో! Also […]

Written By: Srinivas, Updated On : December 8, 2020 4:42 pm
Follow us on


కేంద్రంలో సాఫీగా సాగుతున్న నరేంద్ర మేడీ పాలకు రైతులు బ్రేకులు వేస్తున్నారు. కేంద్ర తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పంజాబ్‌, హర్యానా రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. మంగళవారం చేపట్టిన భారత్‌ బంద్‌లో అన్ని రాష్ట్రాల్లోని రైతులతో పాటు 14 రాజకీయ పార్టీలు పాల్గొనడం విశేషం. ఈ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయపోతే ‘రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడిచిన ఎవుసం’ నిలవదనే సామెత నిజం అవుతుందేమో!

Also Read: రైతుల ఆవేదన.. పోస్టుకార్డుల రూపంలో రాష్ట్రపతికి..!

ఎన్డీఏ నుంచి బయటికొస్తున్న పార్టీలు

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కూడా బయటికి వస్తున్నాయి. మిత్రపక్షం అయిన శిరోమణి అకాలీదళ్ ఇప్పటికే తప్పుకున్నది. పంజాబ్ కు చెందిన ఈ ప్రాంతీయ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తోంది. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రైతుల పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. ఇక మిత్రపక్షమైన రాజస్థాన్ కు చెందిన లోక్ తాంత్రిక్ పార్టీ కూడా ఎన్డీఏ నుంచి తప్పుకొని రైతులకు మద్దతుగా నిలిచింది. ఈ పార్టీ అక్కడ దాదాపు 20 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతోంది.

మెట్టుదిగని మోడీ.. పట్టు వీడని రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. ఇవి రైతులకు ప్రయోజనం చేస్తాయని, ఎలాంటి నష్టం చేయవని చెబుతున్నారు. రైతులు మాత్రం ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దేశంలో 85 శాతం ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఎలా మార్కెటింగ్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అసలు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని లేని చట్టాలు ఎవరికి ప్రయోజనని అడుగుతున్నారు. కార్పొరేట్లతో ఒప్పడం వ్యవసాయం చేస్తే భూమి సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భారత్ బంద్.. ఢిల్లీ సీఎంను గృహనిర్భంధం చేసిన పోలీసులు..!

ఏన్డీఏకు ఇబ్బందులే

రైతు ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుండంతో ఎన్డీఏకు ఇబ్బందులు తప్పేలా లేవు. మిత్రపక్షాలు సైతం బయటికి వెళ్తుండడంతో ఇప్పటికే ఆత్మరక్షణలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని మోడీ మాత్రం మొండిగా ముందుకు వెళ్తుండడంతో ఎదురుగాలి తప్పదనే భావన పార్టీ నేతల్లోనే ఉన్నది. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఈ ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. వెంటనే అగ్రి చట్టాలను రద్దు చేయడం, లేదా రైతుల డిమాండ్ల మేరకు సవరణలు చేస్తే తప్ప.. ఈ గండం నుంచి ఎన్డీయే బయటపడేలా లేదు. చూద్దాం.. మోడీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్