ప్రజల అవసరాలు తెలుసుకుని తీర్చే వాడే నాయకుడు. చరిత్రలో చాలా మంది నాయకులు తమ ప్రత్యేకతను చాటారు. అందులో ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి వారు ఉన్నారు. వారు ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి ఆదరాభిమానాల్ని చూరగొన్నారు. జనం గుండెల్లో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకున్నారు. పాలకులంటే జనం గొంతుల్ని తడిపేవారే అని నిరూపించారు. అందుకోసం నిరంతరం శ్రమించారు.విజయం సాధించారు. లక్ష్యం నెరవేర్చుకున్నారు.
నాడు వైఎస్సార్ చేపట్టిన పథకాలతో ఆయన జనం గుండెల్లో నిలిచిపోయారు. రైతులైతే తమ ప్రియతమ నేతగా గుర్తించారు. ఇప్పుడు జగన్ సైతం ఇదే దారిలో ముందుకు వెళుతున్నారు. రెండేళ్ల పాలనాకాలంలో సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఉచిత బోరు పథకంతో ప్రజలకు జలసిరులు కురిపిస్తున్నారు. ఈ పథకం రాయలసీమలో సూపర్ హిటయింది. బీడు భూముల్లో జల సిరులు కురిపిస్తూ జగన్ కు జేజేలు పలికేలా చేస్తోంది.
వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ పథకం తెచ్చారు. దేశంలోనే మంచి పేరు తెచ్చింది పథకం. ఇప్పుడు జగన్ చేపట్టిన ఉచిత బోరు పథకం కూడా అంతే పేరు తెచ్చుకుంటోంది సీమలో నీటి కరువు సహజమే. దీంతో జలసిరులు నిండి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో నిరాశ నిండిన రైతుల కళ్లల్లో కాంతిరేఖలు వెలుగుచూస్తున్నాయి. పది చోట్ల బోర్లు వేస్తే ఎనిమిది చోట్ల నీరు పడుతూ ఈ పథకం విజయవంతం అవుతోంది.
ఒక్కో బోరు వేయడానికి రూ.2 లక్షలు ఖర్చవుతోంది. దాంతో పాటు ఉచితంగా మోటారు పంపును కూడా రైతులకు ఇస్తున్నారు. దీంతో జనం సంతోషంగా ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విస్తారంగా వర్షాలు కురిసి భూగర్భజలాలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్ కు జనంలో పెద్ద బలం పెరిగి సీమలో తిరుగులేని నేతగా ఎదిగే అవకాశాలున్నాయి.