https://oktelugu.com/

కోల్పోయిన వారికి జగన్ అందలం?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనను నమ్మిన వారిని మోసం చేయరు. జస్టిస్ కనగరాజ్, సంచైతలను తమ ప్రభుత్వంలో మంచి పదవులు ఇచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. జస్టిస్ కనగరాజ్ కోసం కొత్త పదవిని సృష్టిస్తున్నారు. ఆయన మాజీ న్యాయమూర్తి అయినందున ఫిర్యాదుల పరిష్కారం కోసం ఓ కొత్త పోస్టును తీసుకొస్తున్నారు. అలాగే సంచైతకు కూడా పార్టీలో ఏదో ఒక పోస్టు ఇచ్చి గౌరవించాలని భావిస్తున్నారు.మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదా కోల్పోయిన సంచైత గజపతిరాజును కూడా జగన్ ఓ దారి […]

Written By: , Updated On : June 20, 2021 / 04:05 PM IST
Follow us on

Jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తనను నమ్మిన వారిని మోసం చేయరు. జస్టిస్ కనగరాజ్, సంచైతలను తమ ప్రభుత్వంలో మంచి పదవులు ఇచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. జస్టిస్ కనగరాజ్ కోసం కొత్త పదవిని సృష్టిస్తున్నారు. ఆయన మాజీ న్యాయమూర్తి అయినందున ఫిర్యాదుల పరిష్కారం కోసం ఓ కొత్త పోస్టును తీసుకొస్తున్నారు.

అలాగే సంచైతకు కూడా పార్టీలో ఏదో ఒక పోస్టు ఇచ్చి గౌరవించాలని భావిస్తున్నారు.మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదా కోల్పోయిన సంచైత గజపతిరాజును కూడా జగన్ ఓ దారి చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బాధ్యత విజయసాయిరెడ్డి మీద ఉంది. మాన్సాస్ వ్యవహారాన్ని మొత్తం విజయసాయిరెడ్డి దగ్గరుండి చూస్తున్నారు.

సంచైతను తీసుకువచ్చి మాన్సాస్ ను అప్పగించి చైర్మన్ ను చేశారు. కానీ హైకోర్టు తీర్పు వల్ల అంతా రివర్స్ అయిపోయింది. సంచైతను అంతా క్రియాశీలకంగా చేయాలని భావిస్తున్నారు. విజయనగరంలో రాజులకు పోటీగా ఆమెను తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో సంచైత కొనసాగుతున్నారు.

ఆమెను వైసీపీలోకి తీసుకొచ్చి విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుకు పోటీగా నిలబెట్టే అంశాన్ని విజయసాయిరెడ్డి సీరియస్ గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే దానికి సంచైత అంగీకరిస్తారా లేదా అన్నది సందేహమే. ఒప్పుకుంటే రాజకీయ జీవితం, లేకపోతే మరో పదవి ఇస్తారని పేర్కొంటున్నారు. మొత్తానికి వాడుకుని వదిలేశారని అనుకోకుండా ఎవరి గురించి ప్రచారం జరిగితే వారికి న్యాయం చేయడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.