మహేష్ కోసం వ్యూహం మార్చిన రాజమౌళి

మహేష్ బాబు-రాజమౌళి.. ఈ కాంబినేషన్ యే గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. వీరిద్దరి కలిసి సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే అన్నట్టుగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. టాలీవుడ్‌లో వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి. రాజమౌళి కొన్ని నెలల క్రితం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇద్దరూ తమ తమ కొనసాగుతున్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున ఈ […]

Written By: NARESH, Updated On : June 20, 2021 4:00 pm
Follow us on

మహేష్ బాబు-రాజమౌళి.. ఈ కాంబినేషన్ యే గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. వీరిద్దరి కలిసి సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమే అన్నట్టుగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత రాజమౌళి కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయనున్నారు. టాలీవుడ్‌లో వీరిద్దరి డ్రీమ్ ప్రాజెక్ట్ పై బోలెడు అంచనాలున్నాయి.

రాజమౌళి కొన్ని నెలల క్రితం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఇద్దరూ తమ తమ కొనసాగుతున్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. తాజాగా ఈ భారీ చిత్రం నుంచి ఓ ఊహించని వార్త బయటకు వచ్చింది.

ఇప్పుడు దేశమంతా అన్ లాక్ చేస్తుండడంతో ఆర్ఆర్ఆర్ మూవీని దసరాకే విడుదల చేసేందుకు రాజమౌళి యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో చేసే సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్ మార్చేశాడని తెలుస్తోంది.

వచ్చే సంక్రాంతికి మహేష్ సినిమాను రాజమౌళి ప్రకటించనున్నారట.. ఆ వెంటనే ఆ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అప్పటికల్లా మహేష్-త్రివిక్రిమ్ సినిమాను పూర్తి చేస్తాడట.. రాజమౌళి కూడా ఈ గ్యాప్ ను తీసుకొని రిఫ్రెష్ అవుతాడని సమాచారం.