
ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారటీ (పీసీఏ)ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎస్ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఊహించని పరిణామాలతో హైకోర్టు అదేశంతో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పడు మళ్లీ రిటైర్డ్ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని భావించిన జగన్ సర్కార్ పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏను ఏర్పాటు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల ఫిర్యాదులు స్వీకరించకపోయిన ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.