
కరోనా ముందు వరకూ.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా ప్లేట్ మార్చింది. కరోనా లేదు ఏం లేదు ఎన్నికల జరపాల్సిందేనని పట్టుబట్టిన సర్కార్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఉన్నట్టుండి జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది..? గతంలో ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడింది. ఆయనను ఎన్నికల అధికారి పోస్టు నుంచి తప్పించే వరకూ గొడవ చేరింది. చివరకు నిమ్మగడ్డ న్యాయస్థానాలను, కేంద్రాన్ని ఆశ్రయించడంతో మళ్లీ తన పదవి తనకు వచ్చింది.
Also Read: టీడీపీ వలసలపై చంద్రబాబు ఆలోచన ఇదీ!
అయితే.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారిగా మళ్లీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపితే తాము ‘స్వీప్’ చేయలేమని ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ఉందంట. అందుకే.. ఎన్నికలపై ఇలాంటి నిర్ణయాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్నది ఎస్‌ఈసీ ఇష్టం. ఆయన నిర్ణయమే ఫైనల్. అసలు ప్రభుత్వాన్ని హైకోర్టు ఎలాంటి అభిప్రాయం అడగలేదు.
కానీ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పిటిషన్‌పై తన అభిప్రాయం చెప్పేసింది. అందుకే హైకోర్టు కూడా.. ఆ విషయం మీరెలా చెబుతారని ప్రశ్నించి వెళ్లి ఎస్‌ఈసీకి చెప్పాలని సూచించింది. ఎస్‌ఈసీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఎస్‌ఈసీ నిర్ణయమే ఫైనల్. ఆయన ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ పూర్తయిపోయింది. అన్‌లాక్ వచ్చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
Also Read: చంద్రబాబు రాడు.. లోకేష్ చొరవ చూపడు.. ఏంటిది?
ఇప్పుడు ఎస్‌ఈసీ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే.. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించాలంటే.. ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే యంత్రాంగానికి ఎస్‌ఈసీనే చీఫ్ అవుతారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయన ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తీరు భిన్నంగా ఉంది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఇక ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేస్తారనుకోవడం కూడా భ్రమ అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. ఎన్నికలు నిర్వహించలేకపోతే.. అంతకన్నా రాజ్యాంగ సంక్షోభం మరొకటి ఉండదు.