
రాజకీయాల్లో ప్రచారం.. ప్రాచూర్యం పొందాలంటే అడ్వర్టయిజ్‌మెంట్ తప్పనిసరి. అది సోషల్ మీడియా.. మీడియా అయినా. అందుకే.. ఏ ప్రభుత్వం వచ్చినా మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే చూస్తుంటుంది. లేదంటే ఆ రాజకీయ పక్షానికి సపోర్టుగా ఓ మీడియా ఉండాలని కోరుకుంటుంది. సోషల్ మీడియా.. వాట్సాప్ వార్తల జోరు పెరిగిన తర్వాత అసలైన సమాచారం కంటే కల్పిత సమాచారం ఎక్కువైందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. గతంలో మాదిరి నేతలు అధికార క్షేత్రానికి దగ్గరగా ఉండేవారు గతంలో మాదిరి షేర్ చేసుకోవటం లేదు. పెరిగిన సాంకేతికత ఎవరినీ ఓపెన్ కానివ్వటం లేదు. ముఖ్యమైన నేతలు ఎవరూ గతంలో మాదిరి ఫ్రీగా ఫోన్‌లో మాట్లాడడమూ లేదు.
Also Read: తెలంగాణలో ప్రజలకు కేసీఆర్ మరో వరం!
రెగ్యులర్ కాల్స్ మాట్లాడితే.. ఏదో ఒకటి మాట జారడం.. ఆ మాటలను మీడియాలోకి ఎక్కించడం పరిపాటైంది. అందుకే నేతలు కూడా వాట్సాప్ కాల్ లేదంటే టెలిగ్రామ్ కాల్ చేస్తున్నారు. ఇంకొందరైతే గూగుల్ హ్యాంగౌట్ కాల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అందుకే పలువురు నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుస్తుందా లేదా అన్న మాట పక్కన పెడితే.. ఒక వేళ గెలిస్తే బంపర్ మెజార్టీ రావాలని హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. తన ఆధిక్యతను చాటి చెప్పేలా దుబ్బాక ఫలితం ఉండాలన్నది హరీష్ ఆలోచన. దీనికి తగ్గట్లే ఆయన తెర మీదా.. తెర వెనుక భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరిగే రోజు వరకూ కూడా ప్రధాన మీడియాలలో హరీశ్ బొమ్మ.. విజువల్ డైలీ ప్రసారం చేయాల్సిందేనన్న రిక్వెస్టులు వచ్చాయట.
Also Read: మహానగరం.. మళ్లీ మునిగింది..ఈ పాపం ఎవరిది?
ప్రత్యర్థి పార్టీల నేతల ఫొటోలు వాడొద్దని.. వారి సమాచారాన్ని కూడా అండర్ ప్లే చేయాలన్న సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రతిరోజూ పత్రికల్లో హరీష్ వ్యాఖ్యలు.. ఆయన యాక్టివిటీస్ పతాక శీర్షికన నిలుస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అంశాలేమీ పెద్దగా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఉంటుందంటున్నారు. డిజిటల్ మీడియా భారీగా పెరిగిన తర్వాత కూడా ప్రధాన మీడియాలో తాము మాత్రమే హైలెట్ కావాలన్న హరీష్ మాటకు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. తగిన ప్యాకేజీ ఇస్తే ఏ మీడియా అయినా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది.