https://oktelugu.com/

ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు తిప్పలు తప్పడంలేదు. కిందటి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢీలాపడిపోయారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ ఎరగని దారుణ పరాభవాన్ని చవిచూసింది. టీడీపీకి కేవలం 23సీట్లురాగా ఇప్పటికే కొందరు సీఎం జగన్ కు జై కొడుతున్నారు. దీంతో ఏపీలో చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దూరమవుతుందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. Also Read: బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..! ఇప్పటికైతే చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 01:31 PM IST
    Follow us on

    జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు తిప్పలు తప్పడంలేదు. కిందటి ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఢీలాపడిపోయారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ ఎరగని దారుణ పరాభవాన్ని చవిచూసింది. టీడీపీకి కేవలం 23సీట్లురాగా ఇప్పటికే కొందరు సీఎం జగన్ కు జై కొడుతున్నారు. దీంతో ఏపీలో చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దూరమవుతుందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది.

    Also Read: బోగాపురం పరిసరాల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..!

    ఇప్పటికైతే చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష హోదాకు ఢోకాలేకపోయినప్పటికీ మున్ముందు కష్టమేననే మాటలు విన్పిస్తున్నాయి. జగన్మోహన్ సీఎం అయ్యినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ జనాల్లోకి దూసుకెళుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 14నెలల తర్వాత చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పంపై సీఎం జగన్ దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఏడుసార్లు గెలిచారు. 1989నుంచి 2019వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో చంద్రబాబుదే విజయం. వైసీపీ అధికారంలోకి రావడంతో కుప్పంపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

    2024 ఎన్నికల్లో టార్గెట్ సీఎం జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. దీనిలో భాగంగానే కుప్పంలో చంద్రబాబుకు సీటుకు ఎసరు పెట్టేందుకు జగన్ స్కెచ్ వేస్తున్నారు. కుప్పంలో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. గత ఎన్నికల్లో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ తరుపున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి రంగంలో దిగారు. చంద్రబాబు ఇక్కడ ఘనవిజయం సాధించినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రమౌళి కుమారుడు భరత్ కుప్పంలో యాక్టివ్ గా పని చేస్తూ టీడీపీకి చెందిన కిందిస్థాయి నేతలను ఆకర్షిస్తున్నారు.

    Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

    ఇప్పటికే చాలామంది టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో ఏడాదిలోగా టీడీపీకి చెందిన ముఖ్యనేతలందరినీ వైసీపీలో చేర్చుకునేలా ఆపరేషన్ కుప్పం మొదలైనట్లు సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ సత్తాచాటడం ద్వారా చంద్రబాబుకు షాకివ్వాలని జగన్ భావిస్తున్నారు. 2024ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి సీటుకు ఎసరుపెట్టి వైసీపీ పాగా వేసేలా సీఎం జగన్ ముందుకెళుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో వేచి చూడాల్సిందే..!