https://oktelugu.com/

రాయలసీమపై జగన్ ప్రేమకు మరో తార్కాణం!

రాయలసీమకు జగన్ మరో వరం ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ను ప్రకటించిన జగన్ ఇప్పుడు అదే సీమకు విద్యుత్ వెలుగులు పంచడానికి రెడీ అయ్యారు. సీమలో ఉపాధి, పరిశ్రమలను తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వెనుకబడిన కరువు జిల్లాల కరువు తీర్చేలా జగన్ వేసిన ఈ ప్లాన్ చూసి సీమ బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పునరుత్పాదక ఇంధన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 23, 2020 / 01:28 PM IST
    Follow us on


    రాయలసీమకు జగన్ మరో వరం ఇచ్చారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ను ప్రకటించిన జగన్ ఇప్పుడు అదే సీమకు విద్యుత్ వెలుగులు పంచడానికి రెడీ అయ్యారు. సీమలో ఉపాధి, పరిశ్రమలను తెచ్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వెనుకబడిన కరువు జిల్లాల కరువు తీర్చేలా జగన్ వేసిన ఈ ప్లాన్ చూసి సీమ బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం-2020’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి ప్రతిపాదనగా రాయలసీమ జిల్లాల్లో 3-5 గిగావాట్ల (జిడబ్ల్యు) సామర్థ్యం గల అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్స్ (యుఎంఆర్‌పిపి) ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

    Also Read: బాబు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం

    పాలసీ ప్రకారం.. ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించే నోడల్ ఏజెన్సీగా ఉండే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌ఇడిఎసిపి), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇసిఐ) లిమిటెడ్, ఎన్‌టిపిసి లిమిటెడ్ ఇప్పటికే ఓకే చెప్పారు. ఈ పునరుత్పాతక విద్యుత్ ప్లాంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండటానికి ఈ సంస్థలన్నీ ఆసక్తి చూపుతున్నాయి..

    “పునరుత్పాదక అభివృద్ధి పథకంలో భాగంగా కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) గుర్తించిన రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో అల్ట్రా మెగా పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అనంతపూర్, కర్నూలు, కడప జిల్లాల్లో 3-5 గిగా వాట్స్ సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఎన్ఆర్ఈడీసీఏపీ వైస్ చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రమణారెడ్డి వివరించారు.

    ఈ పథకం కింద.. ఎంఎన్‌ఆర్‌ఇ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (సిఎఫ్‌ఎఏ) మెగావాట్ కు 20 లక్షలు లేదా అంతర్గత విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాల అభివృద్ధికి యుఎంఆర్‌ఇపిపిల అభివృద్ధి ఖర్చులో 30 శాతం భరిస్తుంది.

    Also Read: జగన్ వ్యూహం.. టీడీపీ అధినేతకు షాక్

    ఈ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లీజు అద్దెలు మరియు గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఛార్జీలు, పన్ను ఆదాయాలు.. గ్రామాల్లో స్థానిక ఉపాధి వైపు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడతాయని జగన్ ప్రభుత్వం ఆశిస్తోంది.

    ఏ ప్రాంతంలోనైనా పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఆయా రాష్ట్రాలకే కేటాయించడం ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ ప్రాతిపదికన జరుగుతుందని రమణ గుర్తించారు.తద్వారా ఏపీలో విద్యుత్ లోటు కూడా తొలగిపోయి నిరంతర విద్యుత్ ఏపీ పొందడానికి కూడా వీలు కలుగుతుంది. ఇలా రాయలసీమకు ఉద్యోగ, ఉపాధియే కాదు.. ఏకంగా విద్యుత్ కూడా ఏపీకి అందుబాటులోకి వచ్చేలా సీఎం జగన్ ప్లాన్ చేశారు.

    -నరేశ్ ఎన్నం