
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించి పరిష్కరించాల్సిందిగా జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైనది ఏపీకి ప్రత్యేక హోదా. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు గోల చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని వారి వాదన.
మరో ముఖ్యమైన డిమాండ్ మూడు రాజధానుల వ్యవహారం. దీంతో కూడా జగన్ ముప్పతిప్పలు పడుతున్నారు. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించినా అక్కడి నుంచి పరిపాలన మాత్రం చేయడం లేదు. ప్రస్తుతం అంతా తాడేపల్లి నుంచే చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద చిక్కు వచ్చింది. అమిత్ షాతో మూడు రాజధానుల విషయం కూడా తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది.
అమరావతికి అప్పట్లో రూ.1500 కోట్లు ఇవ్వగా మరో రూ.వెయ్యి కోట్లు అడగాలని కోరనున్నారు. తెలుగుగంగకు సంబంధించిన తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిల గురించి కూడా అడగనున్నారు. మరోవైపు తెలంగాణ నుంచ రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు తక్షణమే అందజేయాలని కోరనున్నారు. రాష్ర్టంలో ఏర్పడిన రెవెన్యూ లోటును గురించి ప్రస్తావన తేనున్నట్లు తెలుస్తోంది.
ఇంకా రాష్ర్టంల అపరిష్కృతంగా మిగిలిపోయిన సమ్యల గురించి ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నదుల అనుసంధానంపై నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. దీంతో అమిత్ షా పర్యటనపై జగన్ కేంద్రానికి పలు వినతులు విన్నవించేందుకు తయారుగా ఉన్నారని సమాచారం. కానీ తెలంగాణ సీఎం మాత్రం హాజరు కావడం లేదని తెలుస్తోంది.
Also Read: జగన్ సర్కార్ బిగ్ షాక్.. ఇండియన్ మెడికల్ డివైసెస్ రెడ్ నోటీసు
వీడిన వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ.. హత్య వెనుక వైఎస్ కుటుంబీకులే