https://oktelugu.com/

ఇంగ్లీష్ మీడియంపై జగన్‌ మార్క్‌ ఆలోచన..

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతుంటారు. ప్రతి ఒక్కరికీ అన్నిరకాల సంక్షేమ ఫలాలు అందాలంటూ పాలకులకు సూచిస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకే పరిమితమైన ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకూ అందించాలని అనుకున్నాడు. అందరికీ ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని తలిచాడు. కానీ.. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యవిధానం ఇందుకు అడ్డంకిగా మారింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని నూతన విద్యవిధానంలో తేల్చిచెప్పడంతో.. ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 / 11:15 AM IST

    Jagan going to lanch another new welfare scheme

    Follow us on


    ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతుంటారు. ప్రతి ఒక్కరికీ అన్నిరకాల సంక్షేమ ఫలాలు అందాలంటూ పాలకులకు సూచిస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకే పరిమితమైన ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకూ అందించాలని అనుకున్నాడు. అందరికీ ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని తలిచాడు. కానీ.. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యవిధానం ఇందుకు అడ్డంకిగా మారింది. ఐదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని నూతన విద్యవిధానంలో తేల్చిచెప్పడంతో.. ఇక ఏపీలో కూడా జగన్‌ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియం అమలుపై జగన్‌ కూడా తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన చేస్తామని స్పష్టంచేసిన సీఎం.. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.

    Also Read: జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

    ‘తెలుగు మీడియం విద్యార్థులతో పోలిస్తే, ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులు పబ్లిక్, -ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. ఈ అసమానతలు తగ్గించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. జాతీయ విద్యావిధానంలో చెప్పినట్టు దేశవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. మాకూ అభ్యంతరం ఉండదు.’ నూతన విద్యావిధానం అమల్లోకి వచ్చినంత మాత్రాన ఎలాగూ ప్రైవేటు స్కూల్స్‌ తమ వైఖరిని మాత్రం మార్చుకోవు. అలా అయితే ప్రభుత్వ స్కూళ్లలో తామెందుకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టకూడదని జగన్‌ వేస్తున్న ప్రశ్న. అయినా.. కేంద్రం ఇచ్చిన నూతన విద్యావిధానానికి లోబడి మాతృభాషలోనే బోధన కొనసాగించి.. ఇంగ్లిష్‌కు ఇంకొంచెం ప్రాధాన్యత పెంచుతామని అంటున్నారు.

    ‘ఐదో తరగతి వరకే మాతృభాషలో బోధించాలని చెప్పారు కాబట్టి.. ఆరో తరగతి నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతాం. ఇంగ్లిష్‌కు సంబంధించి ఐదో తరగతి వరకు ఎక్కువ ఇన్‌పుట్స్‌ ఇస్తం. వారినీ ఇంగ్లిష్‌లో పర్‌‌ఫెక్టర్స్‌ని చేస్తం. ఇలా చేయడం వల్ల ఆరో తరగతి నుంచి విద్యార్థులు వెంటనే ఇంగ్లిష్ మీడియానికి మారడానికి వీలవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

    Also Read: శిరోముండనం కేసు: నిందితుల అరెస్ట్ ను నిలిపేస్తూ హైకోర్టు సంచలనం

    అటు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన నూతన విద్యావిధానాన్ని తూచ తప్పకుండా పాటిస్తూనే తను అనుకున్న ఇంగ్లిష్‌ మీడియం కూడా అమలు చేయాలనేదే జగన్‌ టార్గెట్‌. ఆర్థిక స్థోమత లేని పిల్లలే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతారని.. వారందరికీ ఇంగ్లిష్‌ మీడియం బోధన అందించాలనేదే తమ ఉద్దేశమని సీఎం అంటున్నాడు. ఇంగ్లిష్‌ మీద అవగాహన లేకపోతే ఫ్యూచర్‌‌లో ఉద్యోగ అవకాశాల్లోనూ వెనుకబడి పోతారని చెప్పాడు. వారి కోసమే ఈ ఇంగ్లిష్‌ మీడియం విద్య అని తెలిపాడు.