CM Jagan- Gowtham Sawang: సీఎం జగన్ నిర్ణయాలు చాలా గోప్యంగా ఉంటాయి. ఆయన తీసుకునే స్టెప్ చాలా రహస్యంగా ఉంచుకుని.. భవిష్యత్ లో రాజకీయ లాభం కోసం ఆలోచిస్తుంటారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఏరికోరి మరీ గౌతమ్ సవాంగ్‌ను డీజీపీగా నియమించుకున్నారు. కాగా ఆయన్ను ఇప్పుడు సడెన్ గా డీజీపీ పదవి నుంచి తప్పించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న ఆయన్ను మార్చడం వెనక పెద్ద కారణమే ఉందంట.
ఇక ఆయన ప్లేస్ లో తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు నిఘా చీఫ్ గా వ్యవహరిస్తున్న కే.రాజేంద్ర నాధ్ రెడ్డిని నియమించారు జగన్. కాగా గౌతమ్ సవాంగ్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తారనే టాక్ కూడా వినిపించింది. కానీ జగన్ ప్లాన్ ప్రకారమే ఆయన్ను మార్చారు. ఆయనకు ఇప్పుడు కీలక పోస్టు అప్పగించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించారు. ఇప్పుడు ఏపీపీఎస్సీకి ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా ఏవీ రమణా రెడ్డి ఉన్నారు.
కాగా పూర్తి స్థాయి బాధ్యతలను గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారరు జగన్. యూపీఎస్సీ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పదవి స్వీకరిస్తారు. ఆ వెంటనే గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన జగన్.. త్వరలోనే జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టబోతున్నారు. యూత్ లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆయన నోటిఫికేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: Vasantha Krishna Prasad-Jagan: జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..
ఇప్పటికే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే తన రాజకీయ భవిష్యత్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ చాలా కీలకం. వాటితోనే యూత్‌ను తనవైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. కాబట్టి ఆ బాధ్యతలను సమర్థుడైన గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారంట జగన్. ఇటు ప్రభుత్వంపై ఎక్కువ భారం పడకుండా, అటు యూత్‌ను ఆకర్షించేలా వ్యూహాలు రచించాలని సూచించారంట.
అలాగే గౌతమ్ సవాంగ్‌ను మార్చిన నేపథ్యంలో వచ్చే విమర్శలకు కూడా ఈ విధంగా చెక్ పెట్టొచ్చని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి రెండు విధాలుగా ప్లాన్ వేసి మరీ ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని గౌతమ్ సవాంగ్ ఏ మేరకు నిర్వరిస్తారు అనేది ఇంకొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే.