https://oktelugu.com/

Hero Aravind Swamy Wife: హీరో అర‌వింద్ స్వామి భార్య సంపాద‌న ఎంతో తెలుసా.. నెల‌కు అన్ని కోట్లా..!

Hero Aravind Swamy Wife: ఒక‌ప్పుడు స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకున్న త‌మిళ హీరో అర‌వింద్ స్వామి అంటే అమ్మాయిల్లో తెగ క్ర‌జ్ ఉండేది. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా వెలుగొందిన ఆయ‌న‌.. రోజా, బొంబాయి లాంటి సినిమాల‌తో నేష‌న‌ల్ వైడ్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీలు తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలు ఇప్ప‌టికీ చాలా ఫేమ‌స్‌. కాగా ఈ సినిమాల త‌ర్వాత ఆయ‌న‌కు పెద్ద‌గా […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 17, 2022 / 12:43 PM IST
    Follow us on

    Hero Aravind Swamy Wife: ఒక‌ప్పుడు స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకున్న త‌మిళ హీరో అర‌వింద్ స్వామి అంటే అమ్మాయిల్లో తెగ క్ర‌జ్ ఉండేది. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా వెలుగొందిన ఆయ‌న‌.. రోజా, బొంబాయి లాంటి సినిమాల‌తో నేష‌న‌ల్ వైడ్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీలు తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలు ఇప్ప‌టికీ చాలా ఫేమ‌స్‌.

    Hero Aravind Swamy

    కాగా ఈ సినిమాల త‌ర్వాత ఆయ‌న‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దాంతో సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి.. బిజినెస్ లు స్టార్ట్ చేశాడు. అందులో బాగానే సంపాదిస్తున్నాడు. కాగా చాలా రోజుల త‌ర్వాత స్టైలిష్ విల‌న్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. తెలుగులో ధృవ మూవీలో విల‌న్ గా చేసి చాలా గుర్తింపు పొందారు. ప్ర‌స్తుతం అటు బిజ‌నెస్‌లోనూ, ఇటు సినిమాల్లోనూ రాణిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.

    Hero Aravind Swamy with his Wife

    Also Read: హీరోయిన్ గౌత‌మి మొద‌టి భ‌ర్త ఎవ‌రో మీకు తెలుసా.. మ‌నంద‌రికీ సుప‌రిచితుడే..!

    అయితే ఇప్పుడు ఆయ‌న భార్య గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఆమె సంపాద‌న గురించే అంతా చ‌ర్చించుకుంటున్నారు. ఆమె ఎవ‌రో కాదండోయ్‌.. దేశంలోనే చాలా ఫేమ‌స్ లాయ‌ర్ అప‌ర్ణ ముఖ‌ర్జీ. దేశంలోని పెద్ద పెద్ద కంపెనీల‌కు సేవ‌లందిస్తోంది. విదేశాల్లో కూడా కేసులు వాదిస్తోంది. ఇక‌పోతే ఆమెకు అర‌వింద్ స్వామి కంపెనీల్లో కూడా బోర్డ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

    అటు త‌న‌కు ఉన్న సొంత కంపెనీల్లో కూడా వాటాలు వ‌స్తున్నాయి. అలాగే ఎన్నో కంపెనీల‌కు లీగ‌ల్ అడ్వ‌యిజ‌ర్ గా చేస్తోంది. ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. అన్నీ క‌లిసి నెల‌కు దాదాపు రూ.30 నుంచి రూ.40కోట్ల దాకా సంపాదిస్తోంది. అంటే ఒక స్టార్ హీరో కంటే ఆమెనే ఎక్కువ సంపాదిస్తోంద‌న్న‌మాట‌. హీరో భార్య అయి ఉండి కూడా ఈ రేంజ్ లో సంపాదించ‌డం ఏంట‌ని అంతా షాక్ అయిపోతున్నారు.

    Also Read: ‘దాసరి’ డైరెక్ష‌న్‌లో యాంక‌ర్ సుమ హీరోయిన్‌గా చేసింద‌న్న విష‌యం మీకు తెలుసా..?

    Tags