Jagan- Amit Shah: ప్రధాని మోదీ తరువాత కేంద్ర హోంశాఖ మంత్రి అగ్రనేతగా వెలుగొందుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వంలో, ఇటు బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని పనులను ఇప్పుడు అమిత్ షా నే చక్కబెడుతున్నారు. రాష్ట్రాల బాధ్యతను కూడా ఆయనే నేరుగా చూసుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో భీకర పోరుకు సిద్ధమవుతున్నారు. అటు ఏపీలో కూడా పార్టీని విస్తరించాలని భావిస్తున్నారు. అటు అధికార పార్టీ వైసీపీతో, ఇటు ప్రధాన విపక్షం టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారు. అటు జనసేనతో ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో ఏపీలో అధికార వైసీపీ, బీజేపీకి గ్యాప్ వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి., ముఖ్యంగా అమిత్ షా వ్యవహార శైలిపై సీఎం జగన్ అగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయన్ను కలవడానికి కూడా ఇష్టపడడం లేదన్న టాక్ నడుస్తోంది. జగన్ ఇటీవల ఢిల్లీ టూర్లలో ఎక్కువగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి వస్తున్నారు. కానీ అమిత్ షాను కలవడం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా? లేక అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదా? జగన్ ను కలిసేందుకు ఇష్టపడడం లేదా? లేక జగనే అవాయిడ్ చేస్తున్నారా? అన్నది ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

కీలక సమావేశానికి డుమ్మా..
సీఎం జగన్ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, అభివృద్దికి గాను సదరన్ సమావేశం తిరువనాంతపురంలో నిర్వహించారు. సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల కోసం నిర్దేశించిన సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్ స్థానికంగా అందుబాటులో ఉన్నా సమావేశానికి ముఖం చాటేశారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సమావేశం గత సారి తిరుపతిలో నిర్వహించారు. నాడు అన్నీ తానై సీఎం జగన్ సమావేశం ఏర్పాటుచేశారు. అమిత్ షాతో కలివిడిగా మాట్లాడారు. చాలా క్లోజ్ గా కనిపించారు. ఈసారి మాత్రం సమావేశానికి గైర్హాజరు కావడం రాజకీయ కోణమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును దగ్గర చేర్చుకోవడంలో అమిత్ షాయే కీలకంగా వ్యవహరించారని.. లోకేష్ తో రహస్యంగా సమావేశమయ్యారన్న అనుమానం జగన్ లో ఏర్పడింది. అందుకే ఆయన అమిత్ షా అంటేనే మండిపడుతున్నారన్న టాక్ నడుస్తోంది. అందుకే సమావేశానికి గైర్హాజరైనట్టు పోలిటికల్ సర్కిల్ లో అయితే ప్రచారం నడుస్తోంది.

రాజకీయాలే కారణమా?
అయితే రాష్ట్ర విభజన హామీలు అమలుకు సదరన్ సమావేశం కీలకం కానుంది., కానీ ఆ సమావేశానికి జగన్ గైర్హాజరు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్న జగన్ కీలక సమావేశానికి గైర్హాజరు కావడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల తెలంగాణ విద్యుత్ బకాయిలపై కేంద్రానికి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.దీంతో కేంద్రం స్పందించింది. ఫైన్ తో సహా రూ.3,700 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో సమావేశం జరుగుతుండడంతో దీనికి ఒక పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉంది. కానీ జగన్ దానిని చేజేతులా దూరం చేసుకున్నారన్న విమర్శ వ్యక్తమవుతోంది. సమావేశానికి కేరళ, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ కోణంలో ఆలోచించే డుమ్మా కొట్టారని ప్రచారం అయితే ఉంది. జగన్ అమిత్ షాను అవాయిడ్ చేయడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఇష్టం లేకుంటే జగన్ ఈ విధంగానే వ్యవహరిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
[…] […]
[…] […]