Samantha: సమంత సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే నిజమైతే ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవడం ఖాయం. అసలు సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు కూడా. విషయంలోకి వెళితే సమంత చాలా బోల్డ్. వెండితెరపై ఆమె అన్ని రకాల పాత్రలు చేశారు. గ్లామర్ షో కూడా చేశారు. ఆఫ్ స్క్రీన్ లో సమంత అంతే బోల్డ్ గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో సమంత సినిమా వేడుకలు ఆమె వేసుకొచ్చిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. లోదుస్తులు కనిపించేలా ఎల్లో ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో హాజరైన ఆమె అందరికీ షాక్ ఇచ్చారు. అప్పట్లో ఆ డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

అది కూడా వివాహం తర్వాత పబ్లిక్ లో సమంత అందాల ప్రదర్శన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో కూడా సమంత అసలు వెనక్కి తగ్గలేదు. రంగస్థలం, సూపర్ డీలక్స్ లాంటి చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఒక ఇంటి కోడలు అయినప్పటికీ ఏమి ధరించాలి, ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో పూర్తి నిర్ణయం ఆమెదే అని ఈ సంఘటనల ద్వారా అర్థం అవుతుంది. ఇక విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఆమె చేసిన ఐటెం సాంగ్ మరొక ఎత్తు. పొట్టి గౌను వేసుకొని రెచ్చిపోయి బోల్డ్ స్టెప్స్ వేసింది.
Also Read: Jagan- Amit Shah: అమిత్ షాపై జగన్ కు అంత కోపం ఏంటబ్బా? అసలేంటి కారణం?
ఆ పాటను మగాళ్ల మీద కోపంతోనే, వాళ్ళ బుద్ధి అలాంటిది కాబట్టే చేశానని సమంత చెప్పడం కొసమెరుపు. అలాంటి సమంత సడన్ గా ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించేదేమి లేదు, గ్లామర్ షో చేసేది లేదని నిర్ణయం తీసుకున్నారట. తన అప్ కమింగ్ చిత్రాల్లో సమంత చాలా పద్దతిగా కనిపించాలి అనుకుంటున్నారట. తనతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలు ఎవరైనా ఈ కండీషన్స్ కి ఒప్పుకుంటేనే సినిమా చేస్తా అంటున్నారట.

బాలీవుడ్ కి వెళ్లిన సమంత అసలు ఈ కట్టుబాట్లతో రాణించగలదా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కారణం… బాలీవుడ్ చిత్రాల్లో బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ లు చాలా కామన్. స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి సన్నివేశాల్లో పాల్గొనాల్సిందే. అక్కడ ఎదగాలని చూస్తున్న సమంత ఈ కండిషన్స్ తో రాణించగలదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా సమంత నిర్ణయం దర్శక నిర్మాతలతో పాటు ఫ్యాన్స్ ని నిరాశపరిచే అంశమే. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలు చేస్తున్నారు.