CM Jagan- Three Capital Issue: ముందు నుంచి ఊహించినట్టుగానే జగన్ మార్కు చూపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అమరావతిలోని ప్లాట్లను డెవలప్ చేసి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకసారి చట్టం చేసిన తర్వాత రద్దు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించింది. అయితే ఆ తీర్పుపై వైసీపీ నేతలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

అయితే జగన్ మాత్రం అప్పుడు వెంటనే స్పందించలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాల వేదికగా స్పందిస్తారని అంతా ఊహించారు. కాగా కాస్త లేటుగా అయినా ఘాటుగానే స్పందించారు జగన్. హైకోర్టు తన పరిధి దాటిందని తేల్చి చెప్పేశారు సీఎం జగన్. చట్టాలు చేయడానికి శాసనసభకు సర్వాధికారాలు ఉంటాయని, అలాంటప్పుడు కొత్త చట్టం చేసి మూడు రాజధానులు చేస్తామని తేల్చేశారు.
Also Read: Pawan Kalyan: నేతాజీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఆ స్ఫూర్తి రగిలిస్తారా?
ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని నిర్మొహమాటంగా చెప్పారు జగన్. ప్రస్తుతం అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం కట్టాలంటే 15 నుంచి 20 లక్షల కోట్లు కావాలని ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం అవుతుందా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టులు అలాంటి తీర్పులు ఎలా ఇస్తాయంటూ అడిగారు.
ఇక జగన్ తర్వాత ఆయన పార్టీ నేతలు కూడా గట్టిగానే కోర్టు తీర్పుపై మండిపడ్డారు. మొత్తానికి జగన్ తగ్గేదే లే అన్నట్టు హైకోర్టు మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పులను ఇలా సభల్లో సవాల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కోరి వివాదాన్ని రాజేసుకున్నట్టే అవుతుంది. జగన్ కొత్త చట్టాన్ని తీసుకు రావడానికి రెడీ అవుతున్న సమయంలో.. లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స రాకుండా చూసుకోవాలి.

అంతే గానీ ఇలా సభా వేదికగా కోర్టు తీర్పులను ప్రశ్నిస్తే.. అది ప్రభుత్వ పని తీరుకు అడ్డంకులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. మరి జగన్ కోరి తలంపులు తెచ్చుకుంటున్నారేమో అనే సంకేతాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. జగన్ ప్రవర్తన చూస్తుంటే.. తనకు అడ్డు చెబితే ఎవరైనా వారితే తప్పు అన్నట్టు మాట్లాడేస్తున్నారు. ఇలాంటి వితండ వాదన సీఎం లకు అస్సలు ఉండొద్దు. ఏ విషయంలో అయినా సంయమనం పాటించాలి. కానీ జగన్ మాత్రం అందుకు పూర్తి విభిన్నం. ఈ దూకుడు ఆయన పార్టీని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read:RRR Movie Review: రివ్యూ : ‘ఆర్ఆర్ఆర్’

[…] Chandrababu Naidu: ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి అప్పుడే నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని రాజకీయా పార్టీల ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన టీడీపీ ఈసారి ఆ పరిస్థితి రావొద్దని సమాయత్తమవుతుంది. గత ఎన్నికల్లో చేసిన తప్పేంటి..? మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? లాంటి విషయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత బాబు అభ్యర్థుల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని సైకిల్ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ఎదగలేకపోతున్నా.. వచ్చే రోజుల్లో మంచిరోజులు వస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ టికెట్ కోసం కొన్ని ఏరియాల్లో పోటీ పడుతున్నారు. దీంతో బాబుకు కొత్త తలనొప్పి మొదలైంది. […]
[…] Also Read: హైకోర్టు తీర్పు సరైంది కాదు.. జగన్… […]