జూన్ లో నాలుగు స్థానాలు ఏపీ నుంచి ఖాళీ కానున్నాయి. అందులో విజయసాయిరెడ్డి పదవీ కాలం జూన్21న ముగుస్తుంది. టార్గెట్ 2024లో భాగంగా ప్రతి ఎంపిక జగన్ పక్కా వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నారు. విజయసాయిరెడ్డితోపాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవీకాలం సైతం ముగియనున్నాయి. విజయసాయిరెడ్డి స్థానం రెన్యూవల్ అయినా మిగిలిన మూడు స్థానాలు ఇప్పటికే రిజర్వ్ అయిపోననట్లు ప్రచారం సాగుతోంది.
రెండో పేరు సైతం బీజేప పెద్దల అభ్యర్థన మేరకు గతంలో మోదీ గుజరాత్ లో పనిచేసిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి కిషోర్ రావు పేరు వినిపిస్తోంది. అనూహ్యంగా వినిపిస్తున్న మరో పేరు మెగాస్టార్ చిరంజీవి. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పూర్తిగా వైసీపీకే అనుకూలంగా ఉన్నాయనేది పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. రాష్ర్టంలో 2024 నాటికి కాపు వర్గం కీలకం కానుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాని వైసీపీ భావిస్తోంది.
పరిపాలనలో మూడో ఏట అడుగిడిన జగన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. గతంలో తన తండ్రితో సన్నిహితంగా మెలిగిన చిరంజీవిని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటికే రెండుసార్లు చిరంజీవి అమరావతి వెళ్లి జగన్ ను కలిశారు. చిరంజీవిని తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపితే కాపు ఈక్వేషన్ వర్కవుట్ అవుతుందని వైసీపీ అంచనా వేస్తోంది.