https://oktelugu.com/

Actor Dhanush: శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు అండగా నేను కూడా అంటున్న హీరో ధ‌నుష్…

Actor Dhanush: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ ట్వీట్ చేసిన విషయం నిన్నజరిగింది. అయితే తాజాగా త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 26, 2021 / 11:18 AM IST
    Follow us on

    Actor Dhanush: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్టర్ కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ ట్వీట్ చేసిన విషయం నిన్నజరిగింది. అయితే తాజాగా త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కూడా కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు సాయం చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

    Actor Dhanush

    Also Read: నిజమైన దానం గుణం అంటే ఇదీ… ధనుష్ చూసి నేర్చుకోండయ్యా!

    శివ శంక‌ర్ మాస్టర్ కరోనా వైర‌స్ నుంచి కోలుకోవ‌డానికి అవ‌స‌రం అయిన వైద్య ఖ‌ర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తాన‌ని హీరో ధ‌నుష్ ప్ర‌క‌టించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఆయన హైద‌రాబాద్ న‌గ‌రం లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ తో పాటు ఆయ‌న భార్య‌కు, పెద్ద కుమారుడికి కూడా క‌రోనా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయ‌న భార్య హోం క్వారంటైన్ లో ఉండ‌గా… కుమారుడు కూడా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. శివశంక‌ర్ మాస్ట‌ర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సెలబ్రేటీలు కోరుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి, లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కరోన బారిన పడిన విషయం తెలిసిందే.

    Also Read: శివ శంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను : మంచు విష్ణు