https://oktelugu.com/

అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం

న్యాయస్థానాల నుండి ఇప్పటికే అనేకసార్లు మొట్టికాయలు తిన్న జగన్ సర్కార్ తన విపరీత ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. రాజధాని అమరావతి లో వేరే ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా వైఎస్ జగన్ సర్కార్ 107 జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు రాజధాని తరలింపు పై స్టే విధించింది. ఇక హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 17, 2020 / 03:12 PM IST
    Follow us on

    న్యాయస్థానాల నుండి ఇప్పటికే అనేకసార్లు మొట్టికాయలు తిన్న జగన్ సర్కార్ తన విపరీత ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. రాజధాని అమరావతి లో వేరే ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా వైఎస్ జగన్ సర్కార్ 107 జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు రాజధాని తరలింపు పై స్టే విధించింది. ఇక హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

    Also Read: దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

    ఇక ఈ విషయమై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎప్పటిలాగే…. అందరూ అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయాలని ఆదేశాలను తాము ఇవ్వలేమని పేర్కొంటూ ఈ విషయమై మరలా హై కోర్టును ఆశ్రయించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను నిర్ధాక్షణ్యంగా కొట్టివేసింది. రాజధాని రైతులు చాలా ఖచ్చితంగా ఉంది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే భూములు ఇచ్చామని…. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన అవసరాలకు కాకుండా వేరే వాటికి భూములను వినియోగించడం సిఆర్డిఎ చట్టం ప్రకారం కుదరదని అమరావతి రైతులు అంటున్నారు.

    Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

    ఇదిలా ఉంటే…. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే హైకోర్టు మాత్రం దీనిపై ఈ నెలాఖరు వరకు స్టే విధించింది. ఈ దెబ్బతో రెండు రోజుల క్రితం చేద్దామనుకున్న విశాఖ రాజధాని శంకుస్థాపన వాయిదా వేయవలసి వచ్చింది. ఇక తమ వైఫల్యాలను సమీక్షించకుండా ప్రజల బాగోగుల గురించి ఆలోచించకుండా… మొండి పట్టుదలతో ప్రతిసారి కోర్టు తీర్పుపై సవాల్ చేయడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని నిపుణులు అంటున్నారు.