https://oktelugu.com/

ప్రభాస్‌, మహేశ్‌, పవన్‌ కావాలంటున్న  బోల్డ్‌ బ్యూటీ!

టెలివిజన్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తెలుగులో తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్‌ 100’ లో అందలు ఆరబోసి యూత్‌ హార్ట్‌ బీట్‌ పెంచింది. దాంతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. అందం, అభినయం రెండూ ఉన్నా మొదటి సినిమాతోనే ఆమెపై బోల్డ్‌ హీరోయిన్‌ అనే ముద్ర పడింది. మళ్లీ అలాంటి పాత్రలే ఆమె ముందుకొచ్చాయి. కెరీర్ ఆరంభంలో ఉండడంతో వాటిని కాదనలేకపోయిందామె.  ‘ఆర్డీఎక్స్ ‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2020 / 03:13 PM IST
    Follow us on


    టెలివిజన్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తెలుగులో తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్‌ 100’ లో అందలు ఆరబోసి యూత్‌ హార్ట్‌ బీట్‌ పెంచింది. దాంతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. అందం, అభినయం రెండూ ఉన్నా మొదటి సినిమాతోనే ఆమెపై బోల్డ్‌ హీరోయిన్‌ అనే ముద్ర పడింది. మళ్లీ అలాంటి పాత్రలే ఆమె ముందుకొచ్చాయి. కెరీర్ ఆరంభంలో ఉండడంతో వాటిని కాదనలేకపోయిందామె.  ‘ఆర్డీఎక్స్ ‌ లవ్‌’ అనే చిన్న సినిమాలో  మరింత బోల్డ్‌గా కనిపించింది. పాయల్‌తోనే ఆ సినిమాకు గుర్తింపు వచ్చింది. కానీ, కంటెంట్‌ లేకపోవడంతో ఆ  చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. ముఖ్యంగా రవితేజ సరసన డిస్కో రాజాలో బధిర యువతిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    వెంకటేశ్‌, రవితేజ లాంటి పెద్ద హీరోలతో నటించడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పాయల్‌ భావించింది. అందుకోసం పంజాబీ సినిమాలను సైతం కాదనుకొని తెలుగు, దక్షిణాదిపై దృష్టి పెట్టింది. తేజ దర్శకత్వం వహించిన ‘బుల్‌రెడ్డి’ అనే  ఐటమ్‌ సాంగ్‌లో మెప్పించి తాను ఏదైనా చేయగలనని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ, ఇప్పటికీ సెకండ్‌ హీరోయిన్, చిన్న ప్రాజెక్టులే ఆమె ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.  ‘ఏంజెల్’ అనే సినిమాతో తమిళ్‌లో అరంగేట్రం చేయనున్న పాయల్  తెలుగులో ‘నరేంద్ర’ అనే మూవీలో నటిస్తోందామె. అలాగే,  ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా ఓకే చెప్పింది. దాంతో, ఆమె డిజిటల్‌ మీడియాలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో గృహహింస కథాంశంతో ‘ఎ రైటర్’ అనే షార్ట్ ఫిల్మ్‌ చేసి మెప్పించింది. దాంతో,  ఏ మాధ్యమంలో చేసినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి తాను న్యాయం చేస్తానని అంటోంది‌. అదే సమయంలో  పాయల్‌ పెద్ద కలలు కంటోంది. చిన్న సినిమాలు, కుర్ర  హీరోలతో కాకుండా టాలీవుడ్‌లో బడా హీరోల సరసన నటించాలని కోరుకుంటోంది. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కళ్యాన్ లతో  పని చేయాలని ఆశగా ఉందని ఇటీవలే తన మనసులో మాట బయట పెట్టింది. ఇప్పటికే వెంకటేశ్‌, రవితేజతో నటించిన పాయల్‌ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.