https://oktelugu.com/

హిందీ ఇస్మార్ట్‌ ఫిక్స్.. హీరో ఎవరంటే?

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు, హీరో రామ్‌ పోతినేనికి పునర్జన్మలాంటి మూవీ  ఇస్మార్ట్ శంకర్.  వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న పూరి, రామ్‌  కాంబినేషన్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు ఈ ఇద్దరి కెరీర్లో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. పూరి, రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్‌కు మంచి పేరు వచ్చింది. మొమోరీ ట్రాన్స్‌ప్లాంట్‌ అనే కాన్సెప్ట్‌కు తన మార్కు లవ్‌, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2020 / 03:06 PM IST
    Follow us on


    స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు, హీరో రామ్‌ పోతినేనికి పునర్జన్మలాంటి మూవీ  ఇస్మార్ట్ శంకర్.  వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న పూరి, రామ్‌  కాంబినేషన్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు ఈ ఇద్దరి కెరీర్లో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. పూరి, రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్‌కు మంచి పేరు వచ్చింది. మొమోరీ ట్రాన్స్‌ప్లాంట్‌ అనే కాన్సెప్ట్‌కు తన మార్కు లవ్‌, యాక్షన్తోపాటు  కమర్షియల్‌ హంగులు జోడించి పూరి తీసిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కాన్సెప్ట్‌ బాలీవుడ్‌ను కూడా మెప్పించింది. దాంతో, ఇస్మార్ట్‌ శంకర్ మూవీని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది.

    ఈ రీమేక్‌కు బాలీవుడ్‌ యువ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా ఎంచుకున్నట్టు సమాచారం. తొందర్లోనే ఈ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. నవంబర్ నుంచే షూటింగ్‌ మొదలు పెట్టాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారట. రెండేళ్ల క్రితం వచ్చిన ‘సంజు’తో రణ్‌బీర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అది. అందులో అచ్చుగుద్దునట్టు సంజయ్‌ను తలపించిన రణ్‌బీర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో యాక్షన్‌ మూవీ ‘సంషేరా’లో నటిస్తున్నాడు. అలాగే, అమితాబ్‌, నాగార్జునతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో కూడా  కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా కారణంగా  కొన్ని నెలల పాటు చిత్రీకరణ ఆగిపోయింది. ఈ మధ్యే తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది. ‘సంషేరా’ షూటింగ్‌ చివరి దశలో ఉండడంతో అది పూర్తవగానే నవంబర్లో ఇస్మార్ట్‌ రీమేక్‌ షూట్‌ను ప్రారంభించే చాన్సుంది. ఈ మూవీపై తొందర్లోనే అధికారిక ప్రకటనతో పాటు  డైరెక్టర్, హీరోయిన్ల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది