
ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరిగే మాటల యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఒక పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తాజాగా జగన్ సర్కార్ చంద్రబాబుకు ఝలక్ ఇచ్చింది. చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాసంలో ఉన్నవాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది.
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ చేయడం గురించి అధికారులు మాట్లాడుతూ ముందస్తు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు.
ప్రస్తుతం ఎగువ నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తూ ఉండటంతో అధికారులు చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించారు. వరద ఇంకా పెరిగే అవకాశాలు ఉండటంతో ఇళ్లల్లో ఉండకపోవడమే మంచిదని అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇల్లు అక్రమ నిర్మాణమని కూడా గతంలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నదీ ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా చంద్రబాబు ఇల్లు ఉండటంతో విమర్శలు అక్రమయ్యాయి.
నోటీసులు జారీ చేయడం ద్వారా చంద్రబాబు ఇల్లు అక్రమ నిర్మాణమేనని జగన్ సర్కార్ ప్రూవ్ చేసినట్టు అవుతోంది. కరకట్ట కింద చంద్రబాబు ఉంటున్న నివాసానికి రివర్ కన్సర్వేషన్ యాక్ట్ అనుమతులు కూడా లేవని గతంలో ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఏదిఏమైనా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ చంద్రబాబును నిద్రపోనివ్వకుండా ఉండటం గమనార్హం.