https://oktelugu.com/

AP three Capitals: మూడు రాజధానులు జగన్ వదిలేసినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల లొల్లి ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసినా అది కోర్టుకెళ్లి అడ్డుకున్నారు ప్రత్యర్థులు.. కేంద్రం అండతో తన పాలన కాలంలోనే ఆ తంతును పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న వైఎస్ జగన్ కు ఇప్పుడు కోర్టులో ముందరి కాళ్లకు బంధాలు ఏర్పడుతున్నాయి. ఇక ఇప్పటి వేడిలో కరోనా కల్లోలంలో.. అనవసరంగా మూడు రాజధానులంటూ పెంట చేసుకునేందుకు కూడా సీఎం జగన్ ఇష్టపడడం లేదన్న చర్చ సాగుతోంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2021 4:33 pm
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల లొల్లి ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసినా అది కోర్టుకెళ్లి అడ్డుకున్నారు ప్రత్యర్థులు.. కేంద్రం అండతో తన పాలన కాలంలోనే ఆ తంతును పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్న వైఎస్ జగన్ కు ఇప్పుడు కోర్టులో ముందరి కాళ్లకు బంధాలు ఏర్పడుతున్నాయి.

    ఇక ఇప్పటి వేడిలో కరోనా కల్లోలంలో.. అనవసరంగా మూడు రాజధానులంటూ పెంట చేసుకునేందుకు కూడా సీఎం జగన్ ఇష్టపడడం లేదన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో జీతాలు కూడా వెళ్లని పరిస్థితి. ఎక్కడా అప్పు పుట్టని దైన్యం ఉంది. ప్రతి నెల ఆర్బీఐ సహా రుణ సంస్థల నుంచి తీసుకొని ఏపీ సర్కార్ వెళ్లదీస్తోంది. అందుకే మూడు రాజధానులపై విచారణ పిటీషన్లు వాయిదా వేయాలా? కొనసాగించాలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. మీ ఇష్టం అని సర్కార్ వదిలేయడం విశేషంగా మారింది.

    అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. అది కాస్త నిరుత్సాహానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా ఇక మీద విచారణ వేగంగా సాగుతుందని.. ఏదో ఒక నిర్ణయం వెలువడుతుందని ఏపీ ప్రభుత్వం ఆశించింది. కానీ ప్రభుత్వమే చేతులెత్తేయడంతో ఇక విచారణ ఇప్పట్లో సాగదని మూడు రాజధానులు పట్టాలెక్కవని తేలిపోయింది.

    అమరావతి రాజధాని వ్యాజ్యాలపై విచారణ మొదలు కాగానే.. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాయిదా వేయాలని పిటీషన్లు, వాళ్ల తరుఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలు, మహమ్మారి మళ్లీ విజృంభణకు సంబంధించి సంకేతాల పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వాయిదా నిర్ణయాన్ని కోర్టుకే వదిలేశారు.

    ఈ క్రమంలోనే హైకోర్టు అమరావతి కేసుల విచారణను నవంబర్ 15కు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాజ్యాలపై గత మార్చి 26న సీజే నేతృత్వంలో మొదటి సారి విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో మే 3కు దీన్ని వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా తగ్గినా ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో విచారణ వాయిదా పడింది. ప్రభుత్వానికి కూడా మూడు రాజధానులపై ఆసక్తి లేదని తేలిపోయింది.