ఫెస్టివల్ ఆఫర్ లో భాగంగా డాట్సన్ ఇండియా కంపెనీ కార్ల కొనుగోలు విషయంలో డిస్కౌంట్ ను అందిస్తుండటం గమనార్హం. కేరళ కస్టమర్లు కారును కొనుగోలు చేస్తే డిస్కౌంట్ బెనిఫిట్స్ తో పాటు ఉచితంగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్ రూపంలో 20,000 రూపాయలు, ఎక్స్చేంజ్ బోనస్ లో భాగంగా 20,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
అయితే ఈ ఆఫర్లు అన్ని కార్లకు వర్తించవు. కేవలం డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ కార్లను కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఆఫర్లకు అర్హత పొందవచ్చు. రెడిగో కారుపై 30,00 రూపాయల వరకు తగ్గింపు బెనిఫిట్ పొందే అవకాశం ఉండగా క్యాష్ బెనిఫిట్ కింద 20,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ కింద 15,000 రూపాయలు తగ్గింపు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కార్లను కొనుగోలు చేసిన వాళ్లు 5.99 శాతం వడ్డీ రేటుకే కారు లోన్ తీసుకోవచ్చు.
నిస్సాన్ కూడా కొత్త కార్లపై 90,000 రూపాయల తగ్గింపు బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద 70,000 రూపాయలు క్యాష్ బెనిఫిట్ కింద రూ.15 వేలు, ఆన్‌లైన్ బుకింగ్ బోనస్ కింద రూ.5 వేలు పొందే అవకాశం ఉంటుంది. కేరళ కస్టమర్లు నిస్సాన్ కార్ల కొనుగోలుపై 2 గ్రాముల బంగారు నాణేన్ని ఉచితంగా పొందవచ్చు.