
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. వైరస్ ఏ విధంగా సోకుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రోడ్లపైకి అడుగుపెట్టాలంటే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జగన్ సర్కార్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, అర్హత ఉన్న వారికి గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేస్తోంది. దాదాపు 1500 కోట్ల రూపాయలు జగన్ సర్కార్ వైఎస్సార్ పెన్షన్ కానుక అనే స్కీమ్ కొరకు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో ఈ పథకం ద్వారా ఇప్పటికే 61.65 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతుండగా కొత్తగా 34,907 మంది పెన్షన్ పొందడానికి అర్హత పొందారు.
రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డ్ వాలంటీర్లు అర్హులైన వారందరికీ రేపు పెన్షన్ ను పంపిణీ చేయనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో వృద్ధుల్లో చాలామంది బయోమెట్రిక్ వేయాలంటే భయపడుతున్నారు. బయోమెట్రిక్ ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉండటంతో జగన్ సర్కార్ బయోమెట్రిక్ ను తొలగించింది. బయోమెట్రిక్ కు బదులుగా జియో ట్యాగింగ్‌తో ఉన్న ఫోటోలతో పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బయోమెట్రిక్ బదులుగా జియో ట్యాగింగ్ చేయడం వల్ల సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
Comments are closed.