CM Jagan: ఏపీలో ప్రత్యేక హోదా అంశం ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క అంశం చుట్టూ ప్రభుత్వాలు కూడా మారిపోయాయంటే దాని పవర్ అలాంటిది మరి. అయితే ఇప్పుడు మరోసారి ఈ హోదా అంశంపై రగడ సాగుతోంది. రీసెంట్ గా నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో మొదట ప్రత్యేక హోదాను పెట్టి ఆ తర్వాత కేంద్రం తొలగించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. వైసీపీ ప్రభుత్వ చేతకాని తనం వల్లే ఇలా అయిందంటూ ఆరోపిస్తున్నారు.

కాగా ఇదే అంశంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ కావాలనే తన కేసులను మాఫీ చేయించుకోవడానికి కేంద్రం దగ్గర ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదాను అమ్మేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి టు ఢిల్లీ వరకు ఎక్కడా ప్రత్యేక హోదా అంశం అనే మాట వినిపించకుడా చేశారని, కేంద్రం ఏ చట్టాలు తెచ్చినా వైసీపీ ఎంపీలు సైలెంట్ గా సపోర్టు చేస్తున్నారని చెప్పారు.
Also Read: కేసీఆర్ లో నిజంగానే భయం పట్టుకుందా?
ఇక ఇదే అంశంపై ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా గళం విప్పారు. జగన్‌కు, కేంద్రానికి మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని, ఈడీ కేసులకు భయపడి జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించట్లేదన్నారు. దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా తెస్తానంటూ మాయ మాటలు చెప్పి, ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది జగన్‌కు పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎజెండా నుంచి ప్రత్యేక హోదాను కేంద్రం తొలగించడం అంటే దాని మీద ఎలాంటి వివరణ ఇవ్వడానికి వీలుండదు. కాబట్టి దీన్ని కప్పి పుచ్చడం కూడా కష్టం. ఎన్నికలకు ముందు జగన్ దీనిపై పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. ఇప్పుడేమో సైలెంట్ అవుతన్నారనే వాదన ఇప్పటికే యూత్‌లో ఏర్పడింది. దీన్ని గనక ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పట్ట బట్టాయంటే మాత్రం వైసీపీకి నష్టం జరగక మానదు. అయితే టీడీపీ, జనసేన లాంటి పార్టీలు దీనిపై నిరసనలకు పిలుపునిస్తాయా లేదంటూ సైలెంట్ అయిపోతాయా అనేది చూడాలి.
Also Read: అప్పటి నుంచి తెరుచుకోనున్న ఐటీ కంపెనీలు.. రెడీ అంటున్న ఉద్యోగులు..!